జగన్ ,లోకేష్ ఆ హీరో చెప్పినట్టే?

Posted December 16, 2016

jagan lokesh follow same hero styleధృవ సినిమాతో చాన్నాళ్ల తర్వాత ఓ భారీ హిట్ కొట్టాడు రామ్ చరణ్ . ఈ సినిమాలో చరణ్ చెప్పిన ఓ డైలాగ్ ని వైసీపీ అధినేత జగన్ ,టీడీపీ యువనేత లోకేష్ ఫాలో అయిపోతున్నారు. ఇంతకీ టీజర్ తోటే వచ్చిన ఆ డైలాగు ఏంటంటే …నీ స్నేహితుడెవరో తెలిస్తే e నీ క్యారెక్టర్ తెలుస్తుంది …నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది …ఈ డైలాగ్ స్ఫూర్తితోటే జగన్,లోకేష్ తమ స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..అదెలాగో మీరే చూడండి..ఆ ముక్కోణపు మేజిక్ మీకే అర్ధం అవుతుంది.

టీడీపీ సర్కార్ వైఫల్యాల్ని ప్రస్తావించే ప్రతి సందర్భంలో ప్రతిచోటా చంద్రబాబుని జగన్ ఏ స్థాయిలో టార్గెట్ చేస్తారో అందరం చూస్తూనే వున్నాం.అవకాశమొచ్చిన ప్రతి సారి ఆయనకి జగన్ బహిరంగ చర్చల సవాల్ చేస్తుంటారు.జగన్ సవాళ్ళని బాబు వినీవిననట్టుంటారు.ఇంతలో దేవినేని లాంటి ఏ మంత్రో ముందుకొచ్చి జగన్ ని ఏకిపారేస్తారు.బాబుని అనే స్థాయి నీది కాదంటారు.అయినా జగన్ ఆపరు.ఎందుకంటే తాను చంద్రబాబు స్థాయి రాజకీయ నాయకుడిని కావాలంటే ఆయన్నే టార్గెట్ చేసుకోవాలని జగన్ ఫిక్స్ అయిపోయారు.కానీ ఈ మర్మం తెలిసిన బాబు జగన్ మాటకి అంతగా రియాక్ట్ కారు.అంటే చరణ్ చెప్పినట్టు శత్రువుని బాబుగా ఎంచుకుని తన కెపాసిటీ పెంచుకోవాలని జగన్ ప్రయత్నం.దాని ఫలితం మాటెలా వున్నా లోకేష్ కూడా అదే రూట్ లోకి వచ్చారు .

లోకేష్ తాజాగా జగన్ కి రాష్ట్ర అభివృద్ధి మీద చర్చకి రమ్మని సవాల్ విసిరారు . టైం ,ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకోమంటూ మామ బాలయ్య రేంజ్ లో రెచ్చిపోయారు. కానీ బాబు నుంచి ఇదే పాఠం నేర్చుకున్న జగన్ సైలెంట్ అయిపోయారు.అంబటి గారు రంగప్రవేశం చేసి నీది జగన్ స్థాయి కాదంటూ లోకేష్ మీద విరుచుకుపడ్డారు.కానీ రాజకీయాల్లో జగన్ స్థాయిని అందుకోడానికి లోకేష్ ఈ సవాళ్ల పర్వం కొనసాగిస్తూనే వుంటారు.ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ..బాబు దగ్గర నేర్చుకున్న పాఠాలనే లోకేష్ కి జగన్ నేర్పిస్తున్నట్టు లేదు ..ఏదేమైనా ఈ ముక్కోణపు శత్రు కధ చిత్రంగా లేదూ!