నోట్ల కష్టాలతో గవర్నర్ ముందుకు జగన్ …

Posted December 20, 2016

jagan meets governor narasimhan for currency issueఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌ ను కలిశారు ఈ సందర్భం గా ఆయన నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను ఆయన గవర్నర్ కి  వివరించారు రూ. 500, రూ.1000 నోట్ల రద్దుతో 42 రోజులుగా రైతులు, సామాన్యులు, చిరు వ్యాపారులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రం తక్షణమే పరిస్థితులను సమీక్షించి దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరారు.ఆయనతో పాటు పార్టీ నేతలు కూడా గవర్నర్‌ను కలిశారు.

**ఏపీలో 14,740 కోట్లను డిసెంబరు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది
**ఈ నెల 4న ఆర్బీఐ గణాంకాలు వెల్లడి చేస్తూ 17.74 లక్షల కోట్లు సర్కులేషన్ లో ఉందని వెల్లడి చేసిందన్నారు
***ఆర్ధిక శాఖ గణాంకాల ప్రకారం 33 శాతం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని ఇంకా 67 శాతం నోట్లను ప్రభుత్వం చెలామణిలోకి తీసుకు రావాల్సి ఉందని గవర్నర్ కి చెప్పారు .
***ఏపీకి ఇంకా 24 వేల కోట్లు రావాల్సి ఉంటుందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు ..