మోడీ ముందు టైగర్ తోక ముడిచిందా?

0
110

Posted May 10, 2017 at 15:44

jagan meets narendra modi
ఆంధ్రాపప్పు అని గూగుల్ లో సెర్చ్ చేస్తే లోకేష్ పేరు..అదే ఆంధ్రా టైగర్ అని కొడితే జగన్ పేరు వస్తున్నాయని వైసీపీ నేత ఒకరు ఇటీవల గుంటూరు జగన్ దీక్ష టైం లో చెప్పారు.జోగి రమేష్ చెప్పిన ఆ మాట వినగానే వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ముంచుకొచ్చింది.ఈలలు,కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.నిజంగానే జగన్ ని టైగర్ ని చూసినంత ఆశ్చర్యంగా చూసారు.అలాంటి నేత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో మాట్లాడినాక బయటకు వచ్చి బీజేపీ గురించి గానీ,మోడీ గురించి గానీ ఒక్క మాట మాట్లాడడానికి కూడా గజగజలాడిపోయారు.వైసీపీ ఎమ్మెల్యేల్ని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని సీఎం చంద్రబాబు మీద ఫిర్యాదు చేయడానికి అప్పుడెప్పుడో జగన్ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరారు.కానీ అప్పట్లో దొరకని అపాయింట్ మెంట్ ఇప్పుడు దొరికింది .నిన్న రాత్రి ప్రధాని మోడీ కార్యాలయం నుంచి జగన్ కి నేడు రమ్మని ఆహ్వానం అందింది.

ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీని కలిశారు.వివిధ అంశాలపై చర్చించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా,మిర్చి రైతులకి గిట్టుబాటు ధర,చంద్రబాబు అవినీతి,వైసీపీ ఎమ్మెల్యేల్ని లోబరుచుకోవడం వంటి విషయాలపై మోడీ దగ్గర ప్రస్తావించినట్టు జగన్ చెప్పారు.రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ ఇచ్చారా అన్న ప్రశ్న ని జగన్ తప్పుబట్టారు.పైగా రాష్ట్రపతి ఎన్నికల్లో nda అభ్యర్థి గెలుస్తారు ,వేరే వాళ్ళు పోటీ చేయడమే తప్పు అన్నట్టు మాట్లాడారు జగన్.ప్రత్యేక హోదా అంశాన్ని మోడీ దగ్గర గుర్తు చేశామని చెప్తూనే ఆ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్ వెనకడుగు వేశారు.పరోక్షంగా nda రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు జగన్ .మొత్తానికి ఢిల్లీ లో జగన్ మాటలు చూస్తుంటే మోడీ దగ్గర టైగర్ తోక ముడిచినట్టే కనిపిస్తోంది.