ఓదార్పు రాజు వచ్చాడహో…

0
45

Posted April 23, 2017 at 15:49

jagan odarpu yatra
తెలుగు రాజకీయాల్లో “ఓదార్పు” అనే మాట మీద వైసీపీ అధినేత జగన్ కి సోలో రైట్స్ ఉంటాయి అనడంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు.ఏళ్ళకి ఏళ్ళు ఓదార్పు యాత్రల్లోనే గడిపిన సదరు ప్రతిపక్ష నేతకి కష్టంలో వున్న మనిషిని ఎలా ఓదార్చాలో తెలియక క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగి 17 మంది ఇసుక లారీ కింద పడి చనిపోయిన విషయం తెలిసిందే.వారిలో 13 మంది మునగలపాలెం అనే గ్రామానికి చెందినవాళ్లు.మృతుల కుటుంబాలల్ని ఓదార్చడానికి జగన్ ఆ గ్రామానికి వచ్చారు.ఆయన్ని చూసి ఈలలు,కేకలతో వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు.

అసలే అయినవాళ్ళని కోల్పోయి కష్టాల్లో వున్న తమ దగ్గరికి ఈలలు,కేకలు వేసుకుంటూ వస్తారా అని గ్రామస్తులు ఎదురుతిరిగారు.పలకరించడానికి వచ్చారా? రాజకీయం చేయడానికి వస్తున్నారా ? అని నిలదీశారు.దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన ఆ పార్టీ శ్రేణులు బాధిత కుటుంబాల్ని క్షమాపణ అడిగి,వైసీపీ శ్రేణుల్ని అల్లరి చేయకుండా కంట్రోల్ చేసాక ఓదార్పు తంతు ముగిసింది.ఇదంతా చూస్తున్న ఓ పెద్దాయన “ఓదార్పు కి వచ్చినట్టు లేదు ..రాజుగారు దండయాత్రకు వచ్చినట్టుంది “అనడం వైసీపీ శ్రేణులు వింటూనే అక్కడ నుంచి వెళ్లిపోయాయి.