జగన్ బాబు ఇప్పటికి క్లారిటీ వచ్చిందా ..?

Posted November 23, 2016

jagan open up on 500 1000 rs notes banవైస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి నోట్ల రద్దు విషయం లో ఒక క్లారిటీ వచ్చిందట.. ఆవును మరి దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు వుంది ఈయన మాటలు, ప్రాణం బాలేదని మందు కోసం పంపాడట వెనకటికి ఒకడిని వాడు మందు తీసుకు రాలేదు సరి కదా చనిపోయిన తర్వాత మాసికానికి వచ్చాడట ఆలా వుంది జగన్ బాబు మాటలు వింటుంటే , నోట్లను రద్దు చేసి ఇప్పటికి 15 రోజులు , ఈ విషయం మీద ప్రతిపక్షాలు గొడవ చేసి మూడు రోజులు,ఉభయ సభలు రద్దు కూడా ఐన సందర్భాలున్నాయి ఇంత జరిగిన తర్వాత తప్ప ఈ బాబుకు క్లారిటీ రాలేదట మరి ముందు మాట్లాడి ఉంటే ఫలితం ఏంటో తెలియనిది కాదు కదా అసలే అక్రమాస్తుల కేసుల్లో ఏడాది జైలు అనుభవం వుంది కదా మరి ఆచి తూచి మాట్లాడాలి లేక పొతే మల్లి వెళ్ళాలి కదా శ్రీ కృష్ణ జన్మస్థానానికి , అందుకే అనుకుంట ఈ 15 రోజులు బాబు కి క్లారిటీ రాలేదు బాబ్బాబు ప్రతిపక్షం వాళ్లకోసం ఏదో రెండు మాటలు మాట్లాడతా అని బ్రతిమాలుకున్నారో ఏమో కేంద్రాన్ని, ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్ బాబు.

ఇదంతా ముఖ్య మంత్రికిచంద్రబాబుకి ముందే తెలుసు అని అందుకే అయన ఆస్తులు అమ్ముకున్నాడు అని చెప్తున్న ఈ పెద్ద మనిషి మరి ఎన్నాళ్ళు ఏమయ్యాడు ? కేంద్రానికి దడిసి దాక్కున్నాడా ? అయన దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం సర్డుకున్నాక ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు అనేది దేవుడికే తెలియాలి . మొత్తంగా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా మేము వ్యతిరేకం కాదు జాగ్రత్తలు తీసుకొంటే సరిపోను అని పొడి పొడి గా మాట్లాడి ఎదో మ మ అనిపించేలా రెండు మాటలు మాట్లాడి భారం దింపుకున్నాడు జగన్ బాబు ..ఇదే అనుకుంట ఫుల్ క్లారిటీ అంటే ..