జగన్ పుష్కర స్నానం..రాజకీయ యుద్ధం

0
215

  jagan pushkaralu that politics warవైసీపీ అధినేత వ్యవహారశైలి లో ఎంతో మార్పు కనిపిస్తోంది.ఒకప్పుడు పూజలు ,క్రతువులకి దూరంగా వుండే ఆయన వరసబెట్టి స్వామీజీల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.వారం కిందటే ఆయన రిషికేష్ వెళ్లి …శారద పీఠాధిపతి చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొన్నారు.ఓ ప్రతిపక్ష నేతగా ఆయన కృష్ణ పుష్కరాల్లో పాల్గొని స్నానం చేయడం సహజమే .అయితే పుష్కర స్నానానికి వచ్చేముందు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం…అంతకన్నా ముందే విజయవాడ ,లబ్బీపేట లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం వైసీపీ శ్రేణులనే ఆశ్చర్య పరుస్తోంది .

పున్నమి ఘాట్ వద్ద జగన్ పుష్కర స్నానం చేశారు .తాత వై.ఎస్.రాజా రెడ్డి ,తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి లకి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు.తరువాత పుష్కర ఏర్పాట్లపై స్పందించారు.పుష్కరాల్ని కూడా ఓటు బ్యాంకు వ్యవహారంగా మార్చేశారని ఆరోపించారు.ఏర్పాట్ల పేరు చెప్పి విజయవాడలో ఇళ్లు,గుళ్ళు,విగ్రహాలు పడగొట్టిన చంద్రబాబుకి మొట్టికాయలు పడే రోజులు దగ్గర లోనే ఉన్నాయని జగన్ అన్నారు.

మొత్తానికి అధికార,ప్రతిపక్షాలు రెండూ పుష్కరాల్ని రాజకీయం చేశాయి.జగన్ రాకే రాజకీయమని దేశం..ఏర్పాట్లు రాజకీయమని వైసీపీ వాదిస్తున్నాయి.కానీ జనం అదేనండి ఓటర్లు మెండుగా తిరుగుతున్న పుష్కర ఘాట్లని మాత్రం ఇద్దరూ వదిలిపెట్టడం లేదు..