పరిటాల మీద జగన్ చాడీ..ఎవరిది తొండి?

Posted December 15, 2016

paritala-jagan
అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రత్యక్షంగా కలగజేసుకున్న వైసీపీ అధినేత జగన్ కనగానపల్లి ఎంపీపీ ఎన్నికల ఫలితంతో ఖంగుతిన్నారు.మంత్రి పరిటాల సునీత దౌర్జన్యంతో ఎంపీపీ అధికారపక్షానికి దక్కిందని అయన వాపోవడమే కాదు ..ఏకంగా రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.నిజంగానే అధికార బలాన్ని ఉపయోగించి పరిటాల కుటుంబం ఈ పని చేసిందన్న డౌట్ అందరికీ వచ్చింది.కానీ ఫీల్డ్ లోకెళ్తే తొండి ఆటాడి మరీ జగన్ చాడీలు చెప్తున్న విషయం తేటతెల్లమైంది.
గత ఎంపీపీ ఎన్నికల్లో కనగానపల్లి లో టీడీపీ అభ్యర్ధే గెలిచారు. ఆ తర్వాత స్థానికంగా వచ్చిన విభేదాలతో ఇద్దరు ఎంపీటీసీ లు వైసీపీ లో చేరారు.వారిని అడ్డం పెట్టుకుని ఎంపీపీ సాధించాలని …పరిటాల సునీత మీద గెలవాలని జగన్ స్వయంగా రంగంలోకి దిగారు.ఎలాగైనా ఎంపీపీ గెలవాలని వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి కి దగ్గరుండి ఆదేశాలిచ్చారు .కానీ చివరిలో అంతా తిరగబడింది.పార్టీ మారిన ఎంపీటీసీ లు సునీత మాట్లాడాక మనసు మార్చుకుని టీడీపీ కే ఓటేశారు.దీంతో ఎంపీపీ టీడీపీ వశమైంది.పార్టీ మారిన ఎంపీటీసీ ల్ని అడ్డం పెట్టుకుని ఇంత తొండి రాజకీయం చేసిన జగన్ పైగా మంత్రి మీద చాడీలు చెప్పడం చూస్తుంటే …అమ్మ జగన్ …ఆమ్మో జగన్ అనకుండా ఉండగలమా?