జగన్ కి ఉండవల్లి షాక్ ..

0
213

jagan-undavalli
కొన్నాళ్లుగా చంద్రబాబు సర్కార్ మీద కాలుదువ్వుతూ వైసీపీ కి మేలు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక అంశంలో జగన్ కి షాక్ ఇచ్చారు.హోదా గోదాలో జగన్,పవన్ తలపడుతున్న విషయం తెలిసి కూడా ఉండవల్లి కాకినాడ లో జనసేనాధిపతి తలపెట్టిన సభకి,కేంద్రం పై పోరుకి మద్దతిస్తానని ఉండవల్లి అన్నారు.కేంద్ర ప్యాకేజ్ మీద గళం విప్పిన ఉండవల్లి ఆంధ్రాకి తీరని నష్టం జరుగుతోందన్నారు.గుజరాత్ కి ఆంధ్ర పోటీ అవుతుందన్న భయంతోనే మోడీ సర్కార్ హోదా విషయంలో వెనకడుగు వేస్తోందని అయన ఆరోపించారు.

కేంద్రం పై పోరాటానికి ..జనంలోకి వెళ్ళడానికి తన ఫేస్ వేల్యూ సరిపోదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.అదే ఊపులో పవన్ పోరాటానికి మద్దతుని చెప్పి జగన్ కి టెన్షన్ తెప్పించారు.కానీ ఉండవల్లి వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదనిపిస్తోంది.ప్రస్తుతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎలా మాట్లాడినా రాజకీయంగా వైసీపీ పంచన చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి .