జగన్ ఉచ్చులో పవన్ ?

0
132

 Posted October 26, 2016

jagan sketch to pavan special status
ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ అధినేత జగన్ వేసిన స్కెచ్ కి పవన్ దొరికిపోయినట్టేనా? ఔననే సంబరపడుతున్నాయి వైసీపీ శ్రేణులు.అందులో నిజం లేకపోలేదు.తిరుపతి,కాకినాడ సభల్లో ఎంపీల పోరాటం చేస్తే హోదా సాధ్యమేనని చెప్పారు.హోదా కోసం రాజీనామా చేస్తే తానే బాధ్యత తీసుకుని వారిని గెలిపిస్తానని చెప్పారు.ఆ మాటలే ఇప్పుడు వైసీపీ కి బ్రహ్మాస్త్రం అయ్యాయి.అందుకే ఎంపీల రాజీనామా అస్త్రాన్ని బయటికి తీశారు జగన్.అది కూడా ఎన్నికలకి కేవలం ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు గడువు ఉందనగా రాజీనామా అంటున్నారు…అదే సమయంలో జనసేన నిర్మాణం,ప్రచారంలో పవన్ బిజీ గా వుంటారు. ఎన్నికల్లో పాల్గొంటే పాత హామీ గుర్తు చేస్తారు …లేదంటే మద్దతివ్వడం లేదని బద్నామ్ చేస్తారు.ఇలా హోదా పోరాటాన్ని పవన్ దగ్గరనుంచి వెనక్కి తీసుకోడానికి జగన్ సరైన వ్యూహమే వేసాడు.ఆ పద్మవ్యూహం లో పవన్ అభిమన్యుడవుతాడో లేక అర్జునుడిలా చేధిస్తాడో చూడాలి.