జగన్ కి నిద్రలేకుండా చేసిన లగడపాటి నవ్వు?

0
78

Posted April 27, 2017 at 12:14

jagan worried about on lagadapati survey
ఓ వారం కిందట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జరిపిన భేటీ వైసీపీ అధినేత జగన్ కి నిద్ర లేకుండా చేస్తోంది.లగడపాటి ఏ పార్టీలో చేరతాడన్న విషయం కన్నా ఆయన బాబుతో షేర్ చేసుకున్న సర్వే వివరాలే జగన్ ని షేక్ చేస్తున్నాయట. బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే 110 లేదంటే 130 దాకా సీట్లు గెలుచుకోవచ్చని బాబుకి లగడపాటి తాను చేసిన సర్వే వివరాలు చెప్పారట.ఇదే లగడపాటి నాలుగు నెలల కిందట చేసిన ఓ సర్వే లో వైసీపీ కి అనుకూలంగా ఉందని ఓ వార్త గుప్పుమంది.దీంతో లగడపాటి మాట వట్టిపోదంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియా పెద్ద రంకెలే వేసింది .నాలుగు నెలల్లో సీన్ మారినట్టు అదే లగడపాటి చెప్పినట్టు బయటకు తెలియగానే ఆయనంత బోగస్ అన్న ప్రచారం మొదలెట్టింది.అంతవరకు సహజమే కదా ..కానీ ఈ వార్తలు జగన్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయట.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే ఆ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది.ఈ విషయం అందరి కన్నా జగన్ కి బాగా తెలుసు.అందుకే ఈసారి ఏ ఒక్క ఛాన్స్ వదులుకోడానికి ఆయన సిద్ధంగా లేరు.లగడపాటి సర్వే గురించి వస్తున్న వార్తల్ని వైసీపీ నేతలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నా జగన్ అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారట.అందుకే సర్వే గురించి వస్తున్న వార్తల్లో నిజమెంతో కనుక్కోమని పార్టీ ముఖ్యుడు ఒకరికి బాధ్యత అప్పజెప్పారట.ఆ నాయకుడు ఎవరినో అడగడం ఎందుకని పాత పరిచయంతో నేరుగా లగడపాటికే ఫోన్ చేశారట.ఎంతసేపు అడిగినా ,ఎటు తిప్పి అడిగినా ఆ నేత ప్రశ్నకి లగడపాటి నవ్వే సమాధానం అయ్యిందట.ఆ నవ్వుకి అర్ధం డీకోడ్ చేయడానికి సదరు నేత అష్టకష్టాలు పడుతుంటే …జగన్ కునుకు తీయకుండా ఆ నేత చెప్పే కబురు కోసం ఎదురుచూస్తున్నారట.