రేపు జగన్ యువభేరి…

0
109

  jagan yuva bheri meeting tomorrow eluru

రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాకు నీళ్లొదిలి ప్యాకేజీకి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్‌ను నాశనం చేసిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం భేరి మోగించేందుకు జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఏలూరులోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆళ్ల నాని మీడియా తో మాట్లాడారు.

ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది యువతేనని.. ఆ విషయాల్ని యువతకు వివరించి పోరాటంలో భాగస చేయడం కోసమే యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను విద్యార్థులకు, యువతకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.