ఇది చాలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోవడానికి..!

0
111

Posted May 19, 2017 at 16:52

jai lava kusa movie first look release jr ntr fans happy
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జనతాగ్యారేజ్‌’ చిత్రంతో కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటించబోతున్న సినిమాపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుని, కాస్త ఎక్కువ టైం తీసుకుని ఒక మంచి కథను ఎంచుకుని, బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్‌ కమిట్‌ అయ్యాడు. తనలోని నటుడిని ఏ సినిమాకు ఆ సినిమాలో సంతృప్తి పర్చుతూ వస్తున్న ఎన్టీఆర్‌ తాజాగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలో కూడా తనలోని నటుడిని పూర్తి స్థాయిలో తృప్తి పర్చుకోబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ గతంలో ద్వి పాత్రాభినయం చేశాడు. కాని మొదటి సారి త్రి పాత్రాభినయం చేయబోతుండటంతో అంచనాలు, ఆసక్తి భారీగా పెరుగుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ుక్‌ పోస్టర్‌లను ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా నేడు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్‌లతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. పూర్తి స్థాయి మాస్‌గా ఎన్టీఆర్‌ ఏ, బీ క్లాస్‌ ఆడియన్స్‌ను దుమ్ము దుమ్ముగా ఆకట్టుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఫస్ట్‌ుక్‌ చూసిన తర్వాత ఫ్యాన్స్‌ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.