ఎన్టీఆర్‌ బర్త్‌డేకు డబుల్‌ ధమాక

0
103

 Posted May 8, 2017 at 12:22

jai lava kusa movie first look release on ntr birthday
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం ‘జై లవకుశ’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని కళ్యాణ్‌ రామ్‌ భావిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌తో నందమూరి ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కానుక ఇవ్వడం దాదాపుగా ఖరారు అయ్యింది.

‘జై లవకుశ’ చిత్రంతో పాటు మరో సంతోషకర వార్తను కూడా ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఫ్యాన్స్‌ చెవిలో వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే త్రివిక్రమ్‌తో సినిమా ముచ్చట. చాలా కాలంగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ గురించి మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు దాని గురించిన అధికారిక ప్రకటన రాలేదు. అస్సలు త్రివిక్రమ్‌తో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆ విషయాన్ని కూడా క్లారిటీగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్‌కు రెండు అరుదైన బహుమతులు అందనున్నాయి.