వెయ్యి కోట్ల మహాభారతంపై స్పందించిన జక్కన్న

0
86

Posted April 22, 2017 at 18:06

jakanna response to 1000 crores mahabharatha
బాలీవుడ్‌లో వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ మహాభారతం ప్రాజెక్ట్‌ను చేపట్టిన విషయం తెల్సిందే. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్స్‌ అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే చాలా కాలంగా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతం అని, ఎప్పటికైనా ఆ సినిమాను చేస్తానంటూ చెబుతూ వస్తున్న జక్కన్న ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మహాభారతంపై స్పందించలేదంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఎట్టకేలకు జక్కన్న స్పందించాడు. భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో మహాభారతం చిత్రాన్ని చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే మహాభారతం అనేది సముద్రం వంటిదని, దాన్ని ఎవ్వరైనా, ఎన్ని సార్లు అయినా తీసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. తాను భవిష్యత్తులో తప్పకుండా మహాభారతం చేస్తానంటూ మరోసారి చెప్పుకొచ్చాడు. అయితే అందుకోసం తనకు ఇంకా చాలా అనుభవం అవసరం అని తాను భావిస్తున్నట్లుగా కూడా జక్కన్న పేర్కొన్నాడు. జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్దం అయిన విషయం తెల్సిందే.