జ‌క్క‌న్న టార్గెట్ 750 కోట్లు!!

Posted February 2, 2017

jakanna target 750 crores
జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి-2 సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ అప్పుడే 500 కోట్ల కబ్బులో చేరిపోయింది. విడుద‌ల‌కు ముందే బాగా హైప్ రావ‌డంతో సినిమా నిర్మాత‌లు కూడా మంచి త‌రుణం మించిన దొర‌క‌దంటూ… ఈ అవ‌కాశాన్ని బాగా వాడుకున్నార‌ట‌. ముఖ్యంగా డిస్ట్రిబ్యూష‌న్, శాటిలైట్స్ అమ్మేశార‌ట‌. ఈ రెండింటి నుంచే 500 కోట్ల‌రూపాయ‌లు వ‌సూల‌య్యాయ‌ని టాక్.

బాహుబ‌లి-2 సినిమా ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోనే ఉంది. అనుకున్న స‌మయానికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపే మంచి రేటు వ‌చ్చేయ‌డంతో డిస్ట్రిబ్యూష‌న్, శాటిలైట్స్ విక్ర‌యించార‌ట‌. నిజానికి ఇంత రేటు వ‌స్తుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఊహించ‌లేదట‌. దీంతో వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు.

విడుద‌ల‌కు ముందే 500 కోట్ల మార్క్ ను అందుకోవ‌డంతో… విడుద‌ల త‌ర్వాత మ‌రిన్ని సంచ‌ల‌నాలు న‌మోద‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. బాహుబ‌లి-1 ప్ర‌పంచ‌వ్యాప్తంగా 600 కోట్ల‌ను వ‌సూలు చేసి.. రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు బాహుబ‌లి-2 ఆ మార్క్ ను చాలా ఈజీగా దాటేయొచ్చ‌ని అంచ‌నా. అన్నీ క‌లిపితే ఎంత లేద‌న్నా 750 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు రావొచ్చ‌ని టాక్. ఎలాగైనా దాన్ని క్రాస్ చేసేలా ప్ర‌మోష‌న్ ను కూడా బాగా చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ దిశ‌గా బాలీవుడ్ లోని కొంద‌రు బ‌డా స్లార్ల‌ను కూడా ప్ర‌మోష‌న్ లో వాడుకునేందుకు ఆలోచిస్తున్నార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి క‌లెక్ష‌న్ల సునామీ వ‌చ్చేస్తే…. బాహుబ‌లి-2 ఇండియ‌న్ సినిమాలో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.