పెద్దాయనకే చుక్కలు చూపించిన కేటీఆర్!!

Posted December 21, 2016

janareddy vs ktr
తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయంలో తండ్రి కేసీఆర్ ను మించిపోతున్నారు. వాగ్ధాటిలో కేసీఆర్ ను మించిపోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో అయితే అన్నీ తానై వ్యవహరిస్తున్నారాయన. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆయనే ముందుంటున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు మంత్రులను డిఫెండ్ చేస్తూ దూసుకుపోతున్నారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో జానారెడ్డి, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే మాటల్లో పడి జానా రెడ్డి నోరు జారారు. అప్పట్లో అణిచివేయాలనుకుంటే క్షణం పని కాదంటూ ఏవేవో మాట్లాడేశారు. సరిగ్గా ఇదే పాయింట్ ను క్యాచ్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఇవ్వడమే తప్పు అనే అర్థంతో మాట్లాడారంటూ పెద్దాయనకు క్లాస్ తీసుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే జానా కూడా ఈ ఊహించని పరిణామానికి షాకైపోయారట.. కేటీఆర్ రియాక్షన్ చూసి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయట. అసెంబ్లీ బ్రేక్ సమయంలో కేటీఆర్ ను కలిసి ప్రశంసించారని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీలో కేటీఆర్ దూకుడు చూసి ఆయన కేసీఆర్ నే మించిపోయాడని అధికారపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కు ఉజ్వల భవిష్యత్ ఖాయమంటున్నారు గులాబీ నేతలు. కచ్చితంగా పెద్దపదవి ఆయనకే వస్తుందని కేటీఆర్ ను తెగ పొగిడేస్తున్నారు.