“జనసేన” జనం లోనా..ట్విట్టర్ లోనా ..!

Posted December 19, 2016

janasena in people or twitterకేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారా.? సూటిగా అయన విమర్శల బాణాలు వేస్తున్నారా ..సామజిక మాధ్యమాల్ని వేదిక గా చేసుకొని అయన అడగాల్సినవి అడిగేస్తున్నారా ..లేక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం అని చెప్తున్నారా..? తాజా గా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ లు చేస్తూ రోహిత్ అంశం,దేశభక్తి అంశం ,ప్రత్యేక హోదా అంశం, జాతీయ గీతాన్ని ఆలపించే అంశం లాంటి వాటిని ఉటంకిస్తూనే పాలకుల్ని దెప్పుతున్నారు..

నిన్న కాక మొన్న అనంతపురం సభలో అధికారం కాదు న్యాయం కోసం జనసేన పోరాడుతుంది అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా ట్విటర్ ఎక్కడం చూస్తే జనసేనాని రెస్ట్ లో ఉండి ఉద్యమం చేసేలా కనిపిస్తున్నారనిపిస్తుంది.. సమస్యల మీద పోరాడతా అంటే ఇలానా..?

జనం కోసం ఇలాంటి పోరాటం గతం లో జరిగివుంటే భారత దేశానికీ స్వాతంత్య్రం వచ్చేదా..అయన ఆశయాన్ని కించపరచడం కాదుగాని ఇలా ట్విట్టెర్క్కితే మీడియా ,లేదా నెటిజన్స్ కి తప్ప బైట ప్రపంచానికి ఈ మాటలే తెలియదు ..అంతెందుకు ఉదాహరణకి రేపు ప్రత్యేక హోదా మీద ట్వీట్ చేస్తా అన్నారు కదా ఆ ట్వీట్ ఆంధ్ర ప్రదేశ్ లోని మోతుగూడెం.సీలేరు ,డొంకరాయి వంటి ప్రాంతాలకు చేరుతుందా ..అధికారం అవసరం లేక పోయినా పోరాడుతున్న సంగతి అయినా తెలియాలి కదా జనానికి,నాయకుడే ఇలా కూల్ గా ట్వీట్ ఇస్తే.. ఇంక కింది స్థాయి కార్య కర్తలు ..యూత్ఉ పరిస్థితి ఏమిటి ?కొన్ని కోణాల్లో ,సమయాల్లో తలపండిన పెద్దలు కూడ పార్టీ కి అవసరం అనేది గుర్తించి వారిని కూడా ఆకట్టుకోవాలి

జనసేనాని జనం లో ఉండి పోరాడాలి తప్ప ఇలా కాదు స్వాతంత్యానికి ముందు అల్లూరి సీతారామ రాజు వంటి మన్యం వీరులు కూడా తిరిగి జనాన్ని చైతన్య పరిచారు విజయం సాధిచారు. అంతెందుకు బెయిల్ మీద తిరుతున్న జగన్, అధికారం లో ఉన్నముఖ్యమంత్రి చంద్రబాబు ,కేసిఆర్, ప్రధాని మోడీ , సోనియాగాంధీ వంటి వాళ్ళు కూడా జనం లో వున్నారు …కళ్యాణ్ బాబు ఈ విషయం గ్రహిస్తే జన సేన రాజ్యం వస్తుంది లేదంటే మరో ప్రజారాజ్యం కాక తప్పదు ..