జనతా గ్యారేజ్ పై ఎవరేమన్నారు.?

vamsee

రైట‌ర్  వ‌క్కంతం వంశీ మాట్లాడుతూ “ఎన్టీఆర్, కొరటాల శివ నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తులు. స‌త్తా ఉన్న న‌టుడు ఎన్టీఆర్ తో స‌త్తా ఉన్న రైట‌ర్ , డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చేసిన సినిమా జ‌న‌తా గ్యారేజ్ అద్భుత‌మైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్ర‌ణామం అనే సాంగ్ నాకు చాలా బాగా న‌చ్చింది. జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ తర్వాత పాత రికార్డ్స్ అన్ని రిపేర్ అవుతుందని అనుకుంటున్నాను“అన్నారు.

 sai kumar janatha garage all technicians speech

సాయికుమార్ మాట్లాడుతూ “1974లో లెజెండ్, మ‌నంద‌రి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ సినిమాలో డ‌బ్బింగ్ చెప్పాను. ఆయన ఆశీర్వాంతో ఎంటర్ అయిన నేను త‌ర్వాత మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాను. బాల‌య్య‌తో రౌడీ ఇన్ స్పెక్ట‌ర్, క‌ళ్యాణ్ రామ్ తో ప‌టాస్ సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శివ గారికి ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుంది. మోహ‌న్ లాల్ గార్కి ఎన్నో సినిమాల్లో డ‌బ్బింగ్ చెప్పాను. ఆయ‌న‌తో క‌లిసి ఈ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ సినిమాకి వ‌ర్క్ చేయ‌డం గ్రేట్ ఎక్స్ పిరియ‌న్స్. తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌న‌తా గ్యారేజ్  గ్రేట్ మూవీ అవుతుంది“ అన్నారు.

 dill raju janatha garage all technicians speech

దిల్‌రాజు మాట్లాడుతూ ”నేను షూటింగ్‌ టైంలో సాంగ్స్‌ విన్నాను. టైటిల్‌ సాంగ్‌, ప్రణామం సాంగ్‌ వినగానే షూర్‌ ష్యాట్‌ హిట్‌ అవుతుందనిపించింది. సింహాద్రి ఎలాంటి వేవ్‌ ఇచ్చిందో అలాంటి వేవ్‌తో ఈ సినిమా రాబోతుందనిపించింది. జనతాగ్యారేజ్‌ తన కెరీర్‌లో నెంబర్‌వన్‌ సినిమా అవుతుంది. ఈ సినిమాతో కొరటాల శివ హ్యాట్రిక్‌ కొట్టి మరో రేంజ్‌లో ఉంటాడు. నిర్మాతలు శ్రీమంతుడుతో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ కొడతారు. మరో సినిమాను వారు హ్యాట్రిక్‌ కోసం రెడీ చేసుకోవాలి” అన్నారు.

pvp janatha garage all technicians speech

ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ”దర్శక నిర్మాతలకు అభినందనలు. తారక్‌ నా తమ్ముడు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. అలాగే తారక్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.

bvsn janatha garage all technicians speech

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ”ఎన్టీఆర్‌ లుక్‌ బావుంది. గ్యారంటీ మంచి చిత్రమవుతుంది” అన్నారు.

sukumar janatha garage all technicians speech

సుకుమార్‌ మాట్లాడుతూ ”నటనలో చాయిస్‌ వదలకుండా యాక్ట్‌ చేసే నటుడు ఎన్టీఆర్‌. తనతో సినిమా చేసిన తర్వాత మా మధ్య ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడింది. దేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిశ్శబ్దం తప్ప వేరే ఏం లేదు. కొరటాల శివ కమర్షియల్‌ సినిమాకు అప్‌డేట్‌ వెర్షన్‌. నేను నెక్ట్స్‌ సినిమా చేయబోయే సినిమా నిర్మాతలు చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సెన్సేషన్‌ క్రియేట్‌ అవుతుంది. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

Nitya-Menon janatha garage all technicians speech

నిత్యామీనన్‌ మాట్లాడుతూ ”నేను సినిమాలు చేసేటప్పుడు ఎన్టీఆర్‌తో ఎప్పుడు సినిమా చేస్తున్నావని అడిగేవారు. ఈ సినిమాలో తనతో పనిచేసే అవకాశం కలిగింది. ఇంత పెద్ద స్టార్ హీరో తో చేయటం ఇదే మొదటి సారి. మంచి కంటెంట్‌ ఉండే కమర్షియల్‌ సినిమాల చేయాలని ఎప్పటి నుండో ఉండేది. కొరటాల శివగారు నా కోరికను తీర్చారు” అన్నారు.

unn mukundan janatha garage all technicians speech

ఉన్ని ముకుందన్‌ మాట్లాడుతూ ”అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు చాలా పెద్ద థాంక్స్‌. ఎన్టీఆర్‌తో కలసి ఈ సినిమాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులు ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది” అన్నారు.