ఆకాశాన్నంటుతున్న గ్యారేజ్ బెనిఫిట్ షో టికెట్స్ రేట్..!

janatha garage benefit show ticket price

స్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ అందరు బెనిఫిట్ షో చూసేయాలని ఆరాటపడటం మాములే.. సాధారణంగా 50, 70 లు ఉన్న ఆ రేటు కాస్త 1000, 2000కి అలా అమ్ముతుంటారు. అయితే జనతా గ్యారేజ్ టికెట్ల రేట్లు తెలుగు రెండు రాష్ట్రాల్లో చుక్కలనంటుతున్నాయట. ఒక్కో టికెట్ ధర 5వేలు చెల్లించి మరి ఫ్యాన్స్ కొనుగోలు చేస్తున్నారట. ఇక ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే చెన్నై ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో ఏకంగా బినిఫిట్ షో టికెట్లను వేలం వేయడం జరిగిందట.

ఆ వేలంలో మొదటి టికెట్ ను 31,000లకు ఓ అభిమాని సొంతం చేసుకోగా మరో అభిమాని 17500 చెల్లించి టికెట్ తీసుకున్నాడట ఇక మూడో టికెట్ కూడా 1300లకు అమ్ముడయ్యిందని టాక్. సో మొత్తానికి జనతా గ్యారేజ్ ఫీవర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళ నాడులో కూడా భారీ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో నేచర్ లవర్ గా కనిపించబోతున్న తారక్ సినిమాతో ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి.