జనతా గ్యారేజ్ లో కొత్త సీన్లు ఇవే ..

0
257

   janatha garage movie added new scenes
జనరల్ గా ప్లాప్ అయిన సినిమాలకి కొత్త సీన్లు లేదా పాటలు కలిపి ప్రమోట్ చేయడం చూస్తాం .కానీ కొరటాల శివ అందుకు భిన్నం .తీసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ ..అయినా మూడు సార్లు అయన సినిమా రిలీజ్ అయ్యాక కొత్త సీన్లు కలిపాడు.మిర్చి లో వర్షం ఫైట్ ,శ్రీమంతుడులో క్లైమాక్స్ ముందు సీన్లు కలిపాడు .ఇప్పుడు తాజాగా జనతా గ్యారేజ్ కి మరికొన్ని సీన్లు యాడ్ చేశాడు.

జనతా గ్యారేజ్ లో కొత్తగా యాడ్ అయిన సీన్లన్నీ ఎన్టీఆర్ కి సంబంధించినవే .అయన ప్రకృతి గురించి చెప్పే సీన్ ..సమంత తో లవ్ సీన్లు శివ కొత్తగా కలిపాడు .అసలే జనతా గ్యారేజ్ హిట్ తో మంచి హుషారుగా వున్నఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ వార్త పండగే .రిపీట్ ఆడియన్స్ తో జనతా గ్యారేజ్ కలెక్షన్స్ కి కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని నిర్మాతలు ,డిస్ట్రిబ్యూటర్స్ ఆశిస్తున్నారు .