ఎన్టీఆర్ కి ఏడుపొచ్చిందా?

janatha garage success meet ntr speech
జనతా గ్యారేజ్ విజయంతో పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ కి ఏడవాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారా ?నిజంగా ఆయనకి అలాంటి అవసరం లేదు.గ్యారేజ్ ఇచ్చిన విజయం వల్ల ఆనందంతో ఏడుపొస్తున్నా ఆపుకుంటున్నానని ఎన్టీఆర్ స్వయంగా హైదరాబాద్ లో జరిగిన చిత్ర సక్సెస్ మీట్ లో చెప్పారు.ఇలాంటి విజయాన్ని అందించిన కొరటాలకి జీవితాంతం రుణపడి ఉంటానని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడారు.జనతా గ్యారేజ్ విజయం తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.బతికినంత కాలం అభిమానుల్ని ఆలరింపచేయడానికి కష్టపడతానని ఎన్టీఆర్ వివరించారు.మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టడం తాను చేసుకున్న అదృష్టమని జూనియర్ తెలిపారు.