ఆకుప‌చ్చ‌ని అమ్మ‌

Posted December 11, 2016

jaya favourate green,jayalalitha green sarees,jaya witg green saree,amma completed with green
పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లితను చూసిన వారెవ‌రికైనా ఒక‌టే అనుమాన‌ముండేది. ఆమెకు ఆకుప‌చ్చ చీర ఒక్క‌టే ఉందా.. చీర‌లు కొనుక్కోవ‌డానికి డ‌బ్బులు లేవా అనే డౌట్స్ వ‌చ్చేవి. కానీ అంద‌రికీ తెలియ‌నిది ఏమంటే ఆమెకు ఆకుప‌చ్చ రంగంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎప్పుడు ఆకుప‌చ్చ చీర‌ల్లోనే క‌నిపించే వారు. ఆమెకు ఆకుప‌చ్చ‌రంగుకు ఎంత విడ‌దీయ‌రాని సంబంధం ఉందో తెలుసుకుందాం…

ఈ ఏడాది మే 16న ఆరోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు జ‌య ఆకుప‌చ్చ‌ని చీర‌నే ధ‌రించారు. అమ్మ ప్ర‌మాణ స్వీకారం చేసిన మద్రాస్ వ‌ర్సిటీ ఆడిటోరియం కూడా ఆకుపచ్చ రంగులోనే క‌నిపించారామె. అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్యకు జ‌య ఇచ్చిన పూల బొకేకు కూడా ఆకుప‌చ్చ క‌వ‌ర్లే చుట్టారు. అంతేకాదు ప్ర‌మాణ స్వీకారం చేశాక సంత‌కానికి ఉప‌యోగించిన పెన్ను కూడా గ్రీన్ కల‌ర్ దే. అమ్మ చేతి ఉంగరంలోని రాయి క‌ల‌ర్ కూడా ఆకుప‌చ్చ‌దే. ఇది అర్థ‌మైంది కాబ‌ట్టే పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఆకుప‌చ్చ స్టేజ్ నే వాడేవారు. పార్టీ మీటింగ్స్ లో ఆకుప‌చ్చని కార్పెట్ల‌నే వాడేవార‌ట‌. పార్టీలోని మ‌హిళా కార్య‌కర్త‌లు కూడా ఆకుప‌చ్చ‌ని చీర‌ల‌నే ధ‌రించి.. అధినేత్రిపై అభిమానాన్ని చాటుకునేవారు.

గ‌తంలో జ‌య ఐదోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు కూడా గ్రీన్ క‌ల‌ర్ చీర‌ను క‌ట్టుకున్నారు. అక్ర‌మాస్తుల కేసు నుంచి 8 నెల‌ల త‌ర్వాత బ‌యట‌కు వ‌చ్చాక కూడా ఆమె ఆకుప‌చ్చ చీర‌తోనే క‌నిపించారు. ఆమె జీవించి ఉన్నప్పుడే కాదు.. చివరకు ఆమె అంతిమ యాత్రను కూడా ఆ చీరలోనే పూర్తి చేశారు. ఆకుప‌చ్చ రంగు చీర‌తోనే భౌతిక‌కాయాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం రాజాజీ హాల్ లో ఉంచారు. ఆ శారీలోనే జ‌య ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు. అంత‌గా అమ్మ‌తో పెన‌వేసుకొని పోయింది ఆకుప‌చ్చ‌ని రంగు.