అమ్మ నో మోర్ కాదు ….నమ్మొద్దు

Posted December 5, 2016

j
జయలలితకు చికిత్స కొనసాగుతోందని ప్రకటించాయి. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.అంతా అయోమయం.. గందరగోళం తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశం వదంతుల కారణంగా తీవ్ర గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది. ఓ పక్క స్థానిక టీవీ ఛానెళ్లలో అమ్మ కన్నుమూశారన్న వార్తలు ప్రసారం అవడం, చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవనతం చేయడంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారిక ప్రకటన ఏమీ లేకుండానే చోటు చేసుకుంటున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. మరోవైపు అపోలో ఆస్పత్రి వర్గాలు అమ్మకు చికిత్స కొనసాగుతోందని ప్రకటించాయి వదంతులు నమ్మొద్దు అని సంయమనం గా ఉండాలని అంటున్నాయి.