జయ డిశ్చార్జ్ ముహూర్తం?

 Posted October 22, 2016

   jayalalitha discharge from apollo hospital
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడిందా?ఔననే గట్టి సమాచారం అందుతోంది.ఆమె ఇప్పటికే శశికళ,వైద్యులతో కొద్దికొద్దిగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.ఆ సమాచారం అందుకున్న తమిళనాడు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగరరావు ఇవాళ మరోసారి చెన్నై అపోలోకి వెళ్లారు.వైద్యులతో జయ ఆరోగ్యం గురించి అడిగారు.మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి సహా దేశం ఎంపీలు సీఎం రమేష్,మురళీమోహన్ కూడా అపోలోకి వెళ్లి జయ ఆరోగ్యం గురుంచి వైద్యులతో మాట్లాడారు.ఆమె ఆరోగ్యం 95 శాతం మెరుగైందని సుజనా చెప్పారు.

ఇక జయ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారన్నదానిపై తమిళనాట చర్చలు మొదలయ్యాయి.అందుకోసం కూడా తగిన ముహూర్తం నిర్ణయిస్తున్నారట.ఓ జ్యోతిష్కుడు ఆ గణాంకాల పనిలోనే ఉన్నట్టు సమాచారం.అయన నిర్ణయించిన ముహుర్తానికే జయ డిశ్చార్జ్ అవుతారట.ఆ ముహూర్తం ఈ నెల 26 లేదా 27 కావొచ్చని తెలుస్తోంది.