జయలలితకు మళ్ళీ అంత్యక్రియలు

Posted December 14, 2016

jayalalitha funeral according hindu tradition,jayalalitha funeral according, hindu tradition,jayalalitha funeral , hindu tradition by her relativeదివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆమె కుటుంబ సభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున ఆమెకు ఈ క్రియలు నిర్వహించారు. చెన్నైలో జయ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించలేదని.ఆమెను దహనం చేయకుండా, ఖననం(సమాధి) చేశారని ఆమె ఆత్మ శాంతి కోసం మళ్లీ అంత్యక్రియలు నిర్వహించామని అంటున్నారు .

జయలలితకు వరసకు సోదరుడయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండిజరిపించారు . జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఓ బొమ్మను చేయించి, అంత్యక్రియలు చేసారు మరో ఐదు రోజుల పాటు ఆత్మ శాంతి కోసం మరికొన్ని కార్యక్రమాలను చేస్తారట. చెన్నైలో ఆమెను ఖననం చేసిన తీరుపట్ల మేలుకొటే, మైసూరుల్లో ఉండే ఆమె మేనల్లుళ్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరు కూడా జయకు నిర్వహించిన హిందూ సాంప్రదాయ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.