“అమ్మ” సాయంతో….న్యాయవాదిగా మారిన ‘బిక్షగత్తె’

Posted December 7, 2016

Jayalalitha helped woman begging on streets to become lawyerఅన్ని వున్నా పెట్టే గుణం ఉండాలి అంటారు .. కొందరికి ఏమి లేక పోయినా పెట్టే గుణం ఉంటుంది …ప్రార్ధించే పెదవులకన్నా ..పెట్టె చేతులు మిన్న అని మనం వింటుంటాం.. చూస్తుంటాం ..ఎక్కడో మైసూర్ లో రోడ్ల మీద అడుక్కొంటూ జీవం సాగిస్తున్నా చదువు మీద శ్రద్ద తో 10 వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది నాగరత్న ..ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్‌ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం సీఎం జయలలిత చదివారు. నాగరత్న దీనావస్థ చూసి చలించిపోయారు. వెంటనే కర్ణాటకలోని పార్టీ నేత వి.పుగజెందిని సంప్రదించి ఆమెకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆదేశించారు. జయ చిన్నప్పుడు న్యాయవాది అవ్వాలనే కోరిక ఉండేది .కానీ పరిస్థితుల ప్రభావం కారణం గా ..తప్పనిసరి పరిస్థితుల్లో నటి గా మారాల్సి వచ్చింది ..తన లా మరో ఆడపిల్ల జీవితం అలా కాకూడదు అనే ఉద్దేశ్యం తో జయ, నాగరత్న కు సాయం చేశారు ఆమె చదువు కోసం లక్ష రూపాయలను బ్యాంకులో వేసి సాయం అందించారు ..

ప్రస్తుతం నాగరత్న ఎల్‌ఎల్‌బి పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. తాను అడుక్కునే స్థితి నుంచి లాయర్ అవ్వడానికి కారణం జయలలితేనని నాగరత్న చెబుతోంది.జయలలితను కలిసేందుకు వెళ్దామనుకున్నానని,ఇంతలోనే ఈ చేదువార్త వినాల్సొచ్చిందని నాగరత్న కన్నీరుమున్నీరైంది . ఇలాంటి సాయలెన్నో చేసింది కాబట్టే జయ ఆందరికి “అమ్మ ” అయ్యింది.