చిన్నమ్మను వెంటాడుతున్న అమ్మ వారసురాలు!!

Posted January 7, 2017

jayalalitha Niece deepa jayakumar challenge to sasikala
నీ ఇంటికొస్తా… నీ అంతు చూస్తా…! ఈ సినిమా డైలాగ్ ఏ రేంజ్ లో ఉందో… అదే రేంజ్ లో చిన్నమ్మకు వార్నింగ్ ఇస్తోంది ఓ మహిళ. ఈమె మరెవరో కాదు జయలలితకు స్వయానా మేనకోడలు దీపా జయకుమార్. జయ మరణం తర్వాత అన్నాడీఎంకేలో స్థానం కోసం దీప పోటీపడుతోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యతను ఆమె కోరుకుంది. కానీ అది జరిగే అవకాశం లేకపోవడంతో చిన్నమ్మకు దీప గుబులు పుట్టిస్తోంది.

చిన్నమ్మపై దీప సమరభేరి మోగించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ బరిలో ఉంటే తాను ఆమెపై పోటీ చేస్తానని ఇప్పటికే దీప ప్రకటించింది. శశికళ ఆర్కే నగర్ నుంచి గెలిచి సీఎం కావాలనుకుంటే.. అది జరగనివ్వబోనని దీప శపథం చేసిందట. ఆర్కే నగరే కాదు శశి ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను ఆమెపై పోటీ చేయడం ఖాయమట. ఈ దెబ్బతో ఆర్కే నగర్ నుంచి పోటీ చేయకపోవడమే బెటరని చిన్నమ్మకు ఆమె సన్నిహితులు సూచించారని టాక్.

ఇప్పటికే దీపా జయకుమార్‌కు అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు వస్తున్నది. టీనగర్ లోని దీప నివాసానికి వెళ్లే వెళ్లే నాయకులు, కార్యకర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ అసంతృప్త నాయకుల వివరాలను సేకరించే పనిలో ఉందామె. వారందరినీ సంయమనంతో ఉండాలని కోరిందని టాక్. అంతా తాను చూసుకుంటానని కూడా అమ్మ లెవల్లో భరోసా ఇస్తోందట దీప. నిజంగానే దీప … శశికళకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.