పోయెస్ గార్డెన్ లో మన్నార్గుడి మాఫియా రాజభోగాలు!!

Posted December 10, 2016

jayalalitha poes garden living sasikala mannargudi mafia
పోయెస్ గార్డెన్ అంటే తమిళనాడులో అందరికీ తెలిసిన విషయమే. జయలలిత నివాసాన్నే పోయెస్ గార్డెన్ గా చెబుతారు. అమ్మ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పోయెస్ గార్డెన్ ఇప్పుడు కబ్జాకు గురైంది. జయ బతికుండగా ఈ పొలిమేరల్లోకి కూడా వచ్చేందుకు భయపడే మన్నార్గుడి మాఫియా అంతా ఇప్పుడు అక్కడ చేరిపోయింది.

శశికళ సొంత ఊరైన తిరువూరు జిల్లా మన్నార్గుడి. అందుకే శశి వర్గాన్ని మన్నార్గుడి మాఫియాగా చెబుతారు. ఈ బ్యాచ్ లో శశికళతో పాటు.. ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, ఇళవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలు భర్త శివకుమార్‌లు ఉన్నారు. జయ అంత్యక్రియలు అయిపోగానే ఈ మాఫియా మొత్తం తట్టా బుట్టా సర్దుకొని పోయెస్ గార్డెన్ కు వచ్చేసిందట. అంతేకాదు అంత్యక్రియల నుంచి శశి.. ఇక్కడకు రాగానే వీరంతా ఘన స్వాగతం పలికారని చెబుతున్నారు. ఓ రేంజ్ లో గ్రాండ్ పార్టీ జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పోయెస్ గార్డెన్ లో మన్నార్గుడి మాఫియా రాజభోగాలు అనుభవిస్తోందట. అది కావాలి.. ఇది కావాలంటూ పని మనుషులకు వేధింపులు కూడా మొదలయ్యాయని చెబుతున్నారు. గతంలో జయలలిత వీరందరినీ పక్కన బెట్టారు. కానీ జయ పోగానే.. శశికళ వీరందరనీ అక్కున చేర్చుకోవడంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. జయ అధికారంలో ఉన్నప్పుడు శశిని అడ్డం పెట్టుకొని మన్నార్గుడి మాఫియా రాష్ట్రమంతా అనేక సెటిల్ మెంట్లు, అధికారిక కార్యాకలాపాల్లో తలదూర్చిందట. అలా చేసి పెద్ద ఎత్తున డబ్బులు పోగేశారట. అదీ చాలక ఇప్పుడు పోయెస్ గార్డెన్ కు వచ్చి … నాటకాలేస్తున్నారని తమిళ తంబిలు ఈ మాఫియాపై మండిపడుతున్నారు.