జయది ముమ్మాటికీ హత్యే ..కర్ణాటకలో ఉత్తర క్రియలు

Posted December 17, 2016

jayalalitha sister daughter amrutha demand cbi enquiry on jayalalitha death
జయలలిత మరణం చుట్టూ ఇంకా ప్రకంపనలు రేగుతూనే వున్నాయి. ఆమెది ముమ్మాటికీ హత్యేనంటూ జయ సోదరి కుమార్తె అమృత అంటున్నారు. దీనిపై సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.జయని తమకి దూరం చేసింది శశికళ అని అమృత ఆరోపించారు. జయ అంత్యక్రియలు జరిగిన తీరుపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయాలకు భిన్నంగా ఉందంటూ కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం లో అమృత ఆధ్వర్యంలో జయ బంధువులు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఉత్తరక్రియలు నిర్వహించారు.

ఇంతకుముందు జయ మేనకోడలు దీప, ఇప్పుడు జయ సోదరి కుమార్తె అమృత కూడా శశికళని టార్గెట్ చేసినా ఆమె కానీ అన్నాడీఎంకే వర్గాలు గానీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరగలేదు.ఈ మౌనం కూడా శశి వ్యూహం కావచ్చు అంటున్నారు. జయ కుటుంబ సభ్యుల విమర్శలకి ప్రతి విమర్శ లేదా కౌంటర్ చేయడం వల్ల అదనపు ప్రచారం కల్పించడం తప్ప ప్రయోజనం లేదని శశి భావిస్తున్నారట.