జయమ్ము నిశ్చయమ్మురా మూవీ రివ్యూ….

Posted November 25, 2016

jayammu nischayammu raa movie reviewచిత్రం : జయమ్ము నిశ్చయమ్మురా (2016)
నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, గీతాంజలి
సంగీతం : రవిచంద్ర
దర్శకత్వం : శివరాజ్ కనుమూరి
నిర్మాత : శివరాజ్ కనుమూరి
రిలీజ్ డేట్ : 25 నవంబర్, 2016.

‘గీతాంజలి’తర్వాత శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాస్యభరిత చిత్రం”జయమ్ము నిశ్చయమ్మురా”.శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది.శ్రీనివాస్ రెడ్డికి జంటగా పూర్ణ జతకట్టింది.2013 నేపథ్యంలో – కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కథే ఇది.ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.ప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరిపోయే లెవల్ లో జరిగింది.దీంతో.. టాలీవుడ్ దృష్టంతా ఈ చిత్రంపై పడింది. టాలీవుడ్ బడా డైరెక్టర్స్ ప్రశంసలు, భారీ అంచనాల మధ్య శ్రీనివాస్ రెడ్డి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అసలు కథేంటో.. ?తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
సర్వమంగళం( శ్రీనివాసరెడ్డి) కరీంనగర్ కు చెందిన సాధారణ యువకుడు.మూఢనమ్మకాలు ఎక్కువ. పైగా భయస్తుడు కూడా. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాడు. మున్సిపల్ ఆఫీస్ లో క్లర్క్. ట్రాన్స్ ఫర్ మీద కరీంనగర్ నుంచి కాకినాడ వెళతాడు. తనపై ఆఫీసర్ జే.సి(రవివర్మ) స్త్రీ లోలుడు.రాణి(పూర్ణ) మీ సేవ ఉద్యోగి.సర్వమంగళం ఆఫీసు ప్రక్కనే రాణి ఆఫీస్ కూడా.తొలి చూపులోనే రాణితో ప్రేమలో పడిపోతాడు మన సర్వమంగళం.ఓ నర్సరీని ఏర్పాటు  చేయాలన్నది రాణి కోరిక.అందుకోసం మున్సిపల్ ఆఫీస్ కి ఆర్జీ పెట్టుకొంటోంది.ఆ ఫైల్ సర్వమంగళం దగ్గరకే వస్తుంది. అయితే,నర్సరీ అనుమతిని నేపథ్యంలో తనపై అధికారి జేసీ డ్రాప్ లో పడుతుందని సర్వమంగళం గమనిస్తాడు. ఆ తర్వాత సర్వమంగళం ఏం చేశాడు.. ? రాణీ ప్రేమని ఎలా దక్కించుకొన్నాడు.. ?? అన్నది మిగితా స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :
* కామెడీ
* శ్రీనివాస్ రెడ్డి
* సంగీతం

మైనస్ పాయింట్స్ :
* కొన్ని సాగదీసే సీన్స్
* నివిడి

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ఇప్పటి సినిమాల్లో అమాయకత్వం, కష్టించే గుణం, బిడియం లాంటివి హీరో పాత్రలో ఊహించడం కష్టమే.కానీ,ఆలోటుని ‘జయమ్ము నిశ్చయమ్మురా’తీర్చేసింది. దర్శకుడు శివరాజ్ కనుమూరి ఇలాంటి కథని రాసుకోవడం..ప్రధాన పాత్ర కోసం శ్రీనివాస్ రెడ్డిని ఎంచుకోవడం గొప్ప విషయం.ఈ చిత్రంలో కేవలం వినోదం మాత్రమే లేదు.పాజిటివిటిని నింపుతూ వ్యక్తిత్వవికాసానికి దోహదపడే చిత్రంగా తీర్చిదిద్దడం విశేషం.శివరాజ్ కనుమూరి గొప్ప కథని ఎంచుకొంటే..శ్రీనివాస్ రెడ్డి అంతకన్నా గొప్పగా నటించాడు. నటించాడు అనడం కంటే ఒదిగిపోయాడని చెప్పవచ్చు. పూర్ణ నటన సూపర్బ్.పూర్ణ-శ్రీనివాస్ రెడ్డి ల మధ్య సన్నివేశాలని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం భేష్.సర్వమంగళం పై ఆఫీసర్ జే.సి(రవివర్మ) పాత్ర,మున్సిపల్ ఆఫీసర్ లో వాతావరణాన్ని కళ్లకి కంటినట్టు చూపించేశాడు. మిగితా నటునటుల వారి వారి పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా :
పాత్ బ్రేకింగ్ థాట్ తో వచ్చాడు శివరాజ్ కనుమూరి. కథ-స్క్రీన్ ప్లేలోనూ కొత్తదనం చూపించేశాడు.ఓ సాధారణ యువకుడి కథని అందరు గర్వించదగ్గ చిత్రంగా తెరకెక్కించాడు.శ్రీనివాస్ రెడ్డి నటన సూపర్భ్.సాధారణ యువకుడిగా ఒదిగిపోయాడు.మూఢనమ్మకాలు, భయస్తుడిగా ఆకట్టుకొన్నాడు.పూర్ణ కూడా ఏ మాత్రం తగ్గలేదు.ఈ సినిమాతో పూర్ణ బిజీ అయిపోవడం ఖాయం.రవిచంద్ర అందించిన పాటలు,నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి.సినిమా రేంజ్ ని మరింతగా పెంచేశాయి.సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఓకే.కాకపోతే,అక్కడ సోనేరేషన్ ప్రేక్షకుడి ఇబ్బంది పెడుతోంది. తెరపై సినిమా రిచ్ గా ఉంది.ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
సమకాలీన సమాజాన్ని అద్దం పట్టే బోల్డ్ కథ ఇది. రొటీన్ హీరోయిజం,యాక్షన్..గోల గోల సినిమాలు చూసి అలసిపోయిన ప్రేక్షకుడికి..ఈ డిఫరెంట్ చిత్రంలో కాసేపు సేదతీరే ఛాన్సుంది. ఇందులో కథే హీరో. వినోదం మేళవించిన సహజమైన సినిమాలను ఆదరించాలనుకుంటే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాన్ని
తప్పక చూడాల్సిందే.

బాటమ్ లైన్ : జయమ్ము నిశ్చయమ్మురా.. ‘మట్టివాసనలాంటి ఒక సహజమైన కథ’
రేటింగ్ : 3.5/5