అమెరికా లో AP ప్రతినిధి గా జయరాం కోమటి…

Posted December 12, 2016

Jayaram Komati appointed as a ap representative in americaఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నారై జయరాం కోమటి నియమితులయ్యారు. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన కృషి చేస్తారని ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర అమెరికాలో పర్యటించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు ఆర్థిక, సాంకేతిక, మానవ వనరుల అంశాల్లో ఆయన సహాయ సహకారాలు అందజేస్తారు. కాలిఫోర్నియాలో జయరాం కోమటి సుప్రసిద్ధ వ్యాపారవేత్త.ఇండియన్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు