టీడీపీని లైట్ తీసుకుంటున్న జేసీ బ్రదర్స్?

Posted December 2, 2016

Image result for political leaders jc brothers

టీడీపీలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చారు జేసీ బ్రదర్స్. పేరుకు టీడీపీలో ఉన్నా సరే సొంత బలంపైనే పాలిటిక్స్ నడిపిస్తారు జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఈ సంగతేమో కానీ ఇప్పటివరకు ఈ ఇద్దరూ అనంతపురం టీడీపీని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఎంతసేపు అభివృద్ధి పేరుతో హల్ చల్ చేయడం తప్ప టీడీపీ సంక్షేమం వీరికి పట్టదంటున్నారు జేసీ బ్రదర్స్.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్ అనుకున్నది చేశారు. అక్కడి స్వేచ్ఛ బాగా అలవాటైపోవడంతో టీడీపీలోనూ అలానే ప్రవర్తిస్తున్నారట. పార్టీ మారినా వారి వైఖరిలో మార్పు రాలేదట. అయినప్పటికీ చంద్రబాబు కూడా వీరికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును కలవాలంటే ఇతర నాయకులకు కొంచెం టైమ్ పడుతుంది. కానీ జేసీ బ్రదర్స్ అలా కాదు. డైరెక్టుగా బాబుగారి దగ్గరకు వెళ్లిపోతారు. కావాలసిన డెవలప్ మెంటు వర్క్స్ చేయించుకొని వచ్చేస్తారని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు.

ఆ మధ్య రైతాంగానికి చిన్న ట్రాక్టర్లను లెక్కకు మించి ఇప్పించుకోవడంలో జేసీ సోదరులు సక్సెస్ అయ్యారు. రాయదుర్గంలో రోడ్డు విస్తరణను పంతం పట్టి చేయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి బాధితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదట. ఇదే తరహాలో అనంతపురం నగరంలో కూడా విస్తరణ పేరుతో భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నా… పరిహారం విషయంలో స్పష్టత లేదు. ఈ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్నా జేసీ బ్రదర్స్ పట్టించుకోలేదట. అంతేకాదు టీడీపీ లీడర్లు, క్యాడర్ నూ వీరు పెద్దగా పట్టించుకోవడం లేదట.

ఎంతసేపు టీడీపీని వాడుకోవడం తప్ప … జేసీల వల్ల ఒరిగిందేమీ లేదని క్యాడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇవన్నీ అధినేతకు తెలిసినా వారికి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటని గుసగుసలాడుకుంటున్నారు.