ఆ MLA కి జేసీ బ్రదర్స్ ఎర్త్ ..?

Posted November 22, 2016

jc brothers political attacks on mla prabhakar chowdaryఐన వారైనా కాని వారైనా అధికారం డబ్బుముందు అందరు సమానమే..ఇక అధికారం, పదవి కోసం కోసం ఐతే ఎంతకైనా తెగించే వారున్నారు . విషయానికొస్తే అనంతపురం లో దాదాపుగా ఇదే పరిస్థితి వున్నట్టే వుంది .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లో పాతుకు పోయిన జేసీ బ్రదర్స్ తాజా రాజకీయానికి తెర లేపినట్టే వుంది పరిస్థితి చూస్తే, సిట్టింగ్ ఏం ఎల్ ఏ గా వున్నా ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయన నియోజక వర్గం మీద ఇంట్రస్ట్ గా ఉన్న బ్రదర్స్ ఇద్దరూ చౌదరి గారితో మాటమాటకి తగాదా పడుతున్నారట ఇదంతా జేసీ వారసుడిని ఈ నియోజక వర్గం లో నిలబెట్టేందుకు అని గుస గుస ..

టీడీపీ నుంచి చక్రం తిప్పుతున్న ఈ బ్రదర్స్ ఇద్దరు తమ వారసుల్ని రాజకీయాల్లో అరంగేట్రం చేయించాలని అదికూడా తమ జిల్లా లో ఐతే సీట్ ను త్వరగా కన్ఫర్మ్ చేసుకోనేచాన్సు ఉంటుందని వీళ్ళ ఐడియా అట.దాదాపుగా రానున్న ఎన్నికల్లో పోటీలో దింపే ఆలోచనలో వున్నట్టే డిసైడ్.

సీనియర్లు రిటైర్మెంట్ తీసుకొని జూనియర్ లకు ఛాన్స్ ఇస్తున్నారన్న మాట. అనంత ఎంపీ గా వున్నా దివాకర రెడ్డి ఫ్యామిలీ నుంచి పవన్ రెడ్డి , తాడిపత్రి ఏం ఎల్ ఏ గా ఉన్న ప్రభాకర రెడ్డి మల్లి అక్కడ నుంచే రంగం లో వుంటారు కాబట్టి అయన కుమారుడు అస్మిత రెడ్డి ఇంకో చోట సీట్ చూడాలి సో ఇద్దరు అనంత మీదే కన్నేశారు టార్గెట్ చౌదరి ఐనట్టే కదా .ఇప్పటికే ఈ రెడ్డి ,చౌదరి ల మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.నిజానికి ప్ర‌భాక‌ర చౌద‌రి సాఫ్ట్ ప‌ర్స‌న్ అనే అభిమానం ఉంది. రానున్న రోజుల్లో అనంత రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి .