మార్చి వరకు జియో సేవలు ఫ్రీ … ముఖేష్ అంబానీ

Posted December 1, 2016

Image result for jio

జియో వేగాన్ని అడ్డు కోవడం ఎవరి తరం కాదని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. అత్యంత వేగంతో డిజిటల్ అనుభూతిని ,సేవల్ని అందిస్తున్న సంస్థగా జియో ఉందని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా ఉందని అన్నారు. సాంకేతికతను వేగంగా అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమని.. ఇది తమ ఖాతాదారుల విజయమని పేర్కొన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని.. 2017 మార్చి 31 వరకు జియో అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు అంబానీ తెలిపారు. డిసెంబర్‌ 31 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రోజుకు 6లక్షల మంది చొప్పున ‘గడిచిన మూడు నెలలుగా జియోలో చేరారని ఇతర నెట్‌వర్క్‌ కంటే జియో 25రెట్లు వేగంగా పనిచేస్తుంది. జియో అత్యధిక వేగంగా 5 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం సంతోషంగా ఉంది. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు లాంచింగ్‌ ఆఫ్‌ ఇచ్చాం. ఈ-కేవైసీ ద్వారా జియో సిమ్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే యాక్టివేట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం. ఉచితసేవలు అందించేందుకు తాము సిద్ధం గా ఉన్నామని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందిస్తున్నా అని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే కొన్ని సాహసోపేత మైన చర్యలు తప్పవని అన్నారు ..