‘జాలీ ఎల్‌ఎల్‌బి’ రీమేక్‌ గందరగోళం..

0
101

Posted May 14, 2017 at 18:31jolly llb movie remake to pawan kalyan
బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కి సూపర్‌ హిట్‌ అయిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చిత్రం తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాత ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఈ రీమేక్‌ను వెంకటేష్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుందని, స్క్రిప్ట్‌, డైలాగ్స్‌ త్రివిక్రమ్‌ అందించనున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా కొత్త ప్రచారం మొదలైంది.

పవన్‌ కళ్యాణ్‌ ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చిత్రంపై ఆసక్తి చూపుతున్నాడని, ఇటీవలే ఆ సినిమాను చూసిన పవన్‌ కళ్యాణ్‌ తాను రీమేక్‌ చేస్తానంటూ ముందుకు వచ్చాడట. దాంతో త్రివిక్రమ్‌ ఆ రీమేక్‌ విషయమై వెంకీతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వెంకీ కూడా రీమేక్‌ను వదులుకుంటాను అన్నాడట. దాంతో ప్రస్తుతం పవన్‌ ఎల్‌ఎల్‌బి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి ఈ రీమేక్‌ విషయమై గందరగోళ చర్చ జరుగుతుంది.