జర్నలిస్టులకి జెలసీ పుట్టిస్తున్న చంద్రబాబు..

Posted December 14, 2016

journalists jelousabout chandrababu
పబ్లిసిటీ కి ఎక్కడలేని ప్రాధాన్యమిచ్చే ఏపీ సీఎం చంద్రబాబు జర్నలిస్టుల విషయానికి వచ్చేసరికి పెద్దగా పట్టించుకోరని అంటారు.అయన హయాంలో ఒక్కసారి కూడా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడాన్ని అందుకు కారణంగా చూపుతారు. దాంతో ఏ కొద్దిమందో తప్ప అయన దగ్గరైన జర్నలిస్టులు తక్కువే …వెబ్ మీడియా కమ్మేస్తున్న తరుణంలో ప్రింట్,చానెల్స్ లో పని చేసే జర్నలిస్ట్ లకి ఉద్యోగాల కరువు ఏర్పడింది.ఉద్యోగాలున్నా జీతాలు సరిగ్గా రాని పరిస్థితి.ఇక చాలా చానెల్స్ ఎప్పుడు మూత పడతాయో అని జర్నలిస్టులు రోజులు లెక్క బెట్టుకుంటున్నారు. ఇలాంటి టైం లో సాటి జర్నలిస్టులంతా జెలసీ ఫీల్ అయ్యేలా ఓ పాతిక మంది జర్నలిస్టులకి బాబు సర్కార్ ఉద్యోగాలు ఇచ్చింది. జీతం కూడా ఆషామాషీ కాదు …ఒక్కోరి జీతం నెలకి 51 ,468 రూపాయలు.వీళ్లంతా సీఎం కార్యాలయం బ్యాక్ ఆఫీస్ లో పని చేస్తారు.ప్రభుత్వ పధకాల పబ్లిసిటీ ,ఇతరత్రా కార్యక్రమాల ప్రకటనలపై వీళ్ళు పనిచేస్తారు.ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మీడియా కి చేరవేయడం వీరి ప్రధాన విధి.

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ జర్నలిస్ట్ నియామకాలు అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం విడుదలైన జీవో ని చూపుతూ సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సర్కిల్స్ లో చర్చకి దారి తీసింది.25 మంది జర్నలిస్ట్ లకి ఏపీ ముఖ్యమంత్రి అధికారికంగానే లంచం ఇస్తున్నారని ప్రశాంత్ ఆరోపించారు. ఇలా వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం కార్యాలయంలో పని చేస్తున్న వారి జీతాలు,చేస్తున్న పనులు చూసి సాటి జర్నలిస్టులు జెలసీ ఫీల్ అవుతున్నారు.మరికొందరు ముందే తెలిసుంటే తాము కూడా ఓ రాయి వేసి చూసే వాళ్ళం కదా అని వాపోతున్నారు.