సరికొత్త లుక్ లో తారక్..!!

Posted February 11, 2017

jr ntr new look for jai lava kusa movieసినిమా సినిమాకి కొత్తకొత్త హెయిర్ స్టైల్స్ తో, సరికొత్త డ్రస్సింగ్స్ తో మెరుస్తున్నారు ఇప్పటి హీరోలు. వారిలో జూ. ఎన్టీఆర్ ముందుంటాడు. బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్.. ఇలా ఏ సినిమా తీసుకున్నా తారక్ డిఫరెంట్ గెటప్స్ లో అదరగొట్టాడు. తాజాగా ఆయన త్రిపాత్రిభినయం చేయనున్న కొత్త సినిమాలో కూడా మరో కొత్త లుక్ లో మెరవనున్నట్లు తెలుస్తోంది.

జై లవకుశ సినిమా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా తారక్  ఓ కొత్త హెయిర్ స్టైల్ లో  జుట్టుకు క్లిప్ పెట్టుకుని,  కొంచెం గడ్డంతో మాసీ లుక్ లో కనిపించాడు. మరి మిగతా రోల్స్ లో ఎలాంటి లుక్ లో కనిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు