జ్యూసే అమ్మ ప్రాణాలు తీసిందా..?

0
122

Posted April 18, 2017

juice is the reason for jayalalitha's deathతమిళనాడు దివంగత నేత జయలలిత మరణించి ఇన్నాళ్లైన తర్వాత కూడా ఆమె మృతిపై మిస్టరీ వీడటం లేదు. అపోలో వైద్యులు ఇచ్చిన వివరణను కూడా నేతలే కాదు సామాన్యులు కూడా విశ్వసించడం లేదు. ఇక ఆమె సొంత నియోజకవర్గం ఆర్కేనగర్లో అయితే అన్నివేళ్లూ శశికళవైపే చూపిస్తున్నాయి. కానీ జయ మృతికి అసలు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాగా కోలుకుంటున్నారనుకున్న స్థితిలో డాక్టర్ల అనుమతి లేకుండా జయ జ్యూస్ తాగారని, అదే ఆమె ప్రాణాలు తీసిందని చెబుతున్నారు.

నిజంగానే జయ జ్యూస్ తాగినా.. జ్యూస్ కారణంగా ప్రాణాలు పోవడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. డాక్టర్లే పళ్ల రసాలు తాగమని చెబుతుంటారు. పైగా ఏమీ తినే ఓపిక లేనప్పుడు జ్యూస్ తీసుకోమని కూడా వాళ్లే చెబుతారు. అలాంటిది జయను జ్యూస్ తాగొద్దని ఎందుకు చెబుతారని జయ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జయ మరణంపై అందర్నీ తప్పుదోవ పట్టించడానికి జ్యూస్ వాదన తెరపైకి తెచ్చారని విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ, గవర్నర్ మౌనంగా ఎందుకున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు.

మరోవైపు అమ్మ మృతిపై సిన్సియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని తమిళనాడు ఐఆర్ఎస్ అధికారి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పిటిషన్లతో పాటు దీన్ని కూడా కలిపి జులై 4న విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి కోర్టులకు, న్యాయమూర్తులకు జయ మరణంపై అనుమానాలున్నాయి. ఇలాంటి సమయంలో కోర్టు ఏం తీర్పు చెబుతుందనేది కూడా ఆసక్తికరమే. ఇప్పటికే జయ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి కూడా పలువురు డిమాండ్ చేశారు.