కైంట్‌ భయం లేదు..

 

 Posted October 27, 2016
kaint cyclone no dangerకైంట్‌ తుఫాన్‌ బలహీనపడింది. తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ప్రస్తుతం కైంట్‌ తుఫాన్‌ పశ్చిమ నైరుతి దిశగా కదులుతుందని, రాబోయే 24 గంటల్లో మరింతగా బలహీనపడి వాయుగుండం, అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తుఫాన్‌ ఈనెల 28 నాటికి సముద్రంలోనే బలహీనపడుతుందని, అయితే ఒక్కొసారి బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. ప్రస్తుతం కైంట్ తుఫాను గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 380 కి.మీల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 340 కి.మీల దూరంలో, మచిలీపట్నానికి ఈశాన్యదిశగా 500 కి.మీల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో తీరంలో ఇప్పటికే ఈదురు గాలులు మొదలయ్యాయి. విశాఖ, విజయనగరం, కృష్ణా, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వేటకు వెళ్లే మత్య్సకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.