నేనింతే వస్తేరాని లేకపోతే లేదు… నేనేం పాకులాడను

0
64
Posted April 30, 2017 at 17:10
kajal about her careerఅందాల ముద్దుగుమ్మ కాజల్‌ అందంతో పాటు నటనతో ఆకట్టుకుంటూ టాప్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పెద్ద చిత్రాలలో నటించిన ఈ అమ్మడికి వరుస విజయాలు పడడంతో గతంలో పారితోషికాన్ని భారీగా పెంచేసింది. అమ్మడు రేటు బాగా పెంచడంతో నిర్మాతలు కాస్త వెనుకడుగు వేశారు. ఇక కాజల్‌కు అవకాశాలు రానట్టే అనుకున్న సమయంలో చెర్రీ, ఎన్టీఆర్‌ అవకాశాలు ఇచ్చారు. అనంతరం ఈ అమ్మడు మెగాస్టార్‌ చిరంజీవి సరసన భారీ పారితోషికాన్ని పుచ్చుకుని ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటించి హిట్‌ను సొంతం చేసుకుంది.
 
చిరు మంచి హిట్‌ ఇవ్వడంతో ఈ అమ్మడు మళ్లీ రేటు పెంచింది. దాంతో నిర్మాతలు ఈ అమ్మడికి బాగా ఎక్కువయ్యిందని పక్కకు పెట్టారు. కాజల్‌కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలేమి లేవు. తాజాగా మీడియాతో ముచ్చటించిన కాజల్‌ను అవకాశాల గురించి అడగగా నేనింతే, అవకాశాలు వస్తేరాని, లేకపోతే లేదు, అవకాశాల కోసం పాకులాడుతూ అందరిని బ్రతిమిలాడను, నా కోసం పుట్టిన పాత్రలు ఉంటే నన్ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి, వాటినే చేస్తాను అంటూ గడుసుగా సమాధానం చెప్పింది.