కెరీర్‌ ముగింపులో రుణాలు తీర్చుకుంటున్న కాజల్‌

0
90

kajal in kalyan ram production at carier ending
‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్‌ ఆ తర్వాత ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో మొన్నటి వరకు కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కాజల్‌ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇటీవలే ‘ఖైదీ నెం.150’ చిత్రంలో కూడా నటించి ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే ఇటీవలే ఈమెకు పెద్దగా స్టార్స్‌కు జోడీగా అవకాశాలు రావడం లేదు. దాంతో చిన్న హీరోలతో నటించేందుకు సైతం ఓకే చెబుతుంది.

ఇప్పటికే తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాతో పాటు మరో చిన్న హీరోతో నటించేందుకు కమిట్‌ అయ్యింది. అదే కళ్యాణ్‌ రామ్‌ సినిమా. ‘ఇజం’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న కళ్యాణ్‌ రామ్‌ కొత్త దర్శకుడితో ‘ఎమ్మెల్యే’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా గతకు గతంలో అవకాశం ఇచ్చినందుకు గాను కాజల్‌ ఒప్పుకుంది. రానాతో తేజ కారణంగా కాజల్‌ ఒప్పుకుంది. కాజల్‌ను తేజ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక కాజల్‌ మొదటి సినిమా కళ్యాణ్‌ రామ్‌తో చేసింది. ఆ కారణంగానే ఈ రెండు సినిమాల్లో చేస్తుంది. అవకాశాలు లేని ఈ సమయంలో తనకు కెరీర్‌ను ఇచ్చిన వారికి డేట్లు ఇచ్చి వారి రుణం తీర్చుకుంటుంది కాజల్‌. ఈ రెండు సినిమాల తర్వాత కాజల్‌కు మళ్లీ అవకాశాలు రావడం కష్టమే అని తేలిపోయింది.