అబ్బనీ తియ్యని దెబ్బ..కాకాణితో సోమిరెడ్డి?

Posted January 5, 2017

Kakani Govardhan Reddy produce forgery assets papers on somireddy
నెల్లూరు జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపు తిరగబోతున్నాయి. మాటిమాటికీ జగన్ ని టార్గెట్ చేస్తున్న సోమిరెడ్డిని డిఫెన్స్ లోకి నెట్టేందుకు వైసీపీ కాకాణిని ప్రయోగించింది.అయన కూడా రంగంలోకి దిగగానే భారీ అస్త్రమే ప్రయోగించారు.సోమిరెడ్డి కి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించడమే కాకుండా …సాక్ష్యంగా కొన్ని పత్రాల్ని ప్రవేశపెట్టారు.అవి ఫోర్జరీ అంటూ సోమిరెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.విచారణ కోసం జిల్లా పోలీస్ ఉన్నతాధికారి పిలిచినప్పుడు మాములు రాజకీయ నాయకుడిలా కాకాణి మాట్లాడారంట.నాకు దొరికిన పత్రాలు తప్పుడివైతే అది నిరూపించుకోవాల్సిన బాధ్యత సోమిరెడ్డి దేనని వితండ వాదన చేశారట.ఈ సంభాషణ మొత్తం రికార్డు చేసి దాన్ని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి,సీఎం దృష్టికి తీసుకెళ్ళారంట.అప్పటిదాకా సోమిరెడ్డి తప్పేమైనా ఉందేమోనని తటపటాయించిన సీఎం చంద్రబాబుకి వైసీపీ నిరాధార ఆరోపణలు,దాన్ని ఉపయోగించుకుని సోమిరెడ్డి ని దెబ్బ కొట్టేందుకు అదే జిల్లాకి చెందిన సొంత పార్టీ నేతలు ప్రయత్నించడం బాగా అర్ధమైంది.ఇదంతా సోమిరెడ్డిని క్యాబినెట్ లోకి రాకుండా చూసేందుకు చేసిన ప్రయత్నమని బాబు నమ్మారట.

త్వరలో క్యాబినెట్ విస్తరణ సందర్భంగా సోమిరెడ్డికి పెద్ద పీట వేయాలని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. జగన్ ని నిలువరించడానికి సోమిరెడ్డి లాంటి నేతల అవసరం ఉందని అయన అభిప్రాయపడుతున్నారట.అదే సమయంలో ఇప్పటిదాకా సోమిరెడ్డి కి తలనొప్పులు తెస్తున్న జిల్లా మంత్రికి స్థానచలనం తప్పదని తెలుస్తోంది.ఇదంతా చూస్తుంటే తంతే గారెల బుట్టలో పడటమనే సామెత సోమిరెడ్డికి భలే నప్పుతుంది.బాబు దృష్టిలో మళ్లీ ఈ స్థాయి నమ్మకం కలగడానికి కాకాణి ఆరోపణలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన్ని చూసి సోమిరెడ్డి అబ్బనీ తియ్యని దెబ్బ పాట పాడేయొచ్చు …కాదంటారా?