ఎన్టీఆర్ బాబి కి సినిమా బడ్జెట్ ఆంక్షలు..!

Posted December 7, 2016

Kalyan Ram Fix Budget For Ntr Movie

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడు అన్న విషయం మీద ఓ క్లారిటీ వచ్చేసింది. పవర్ తో డైరక్టర్ గా మారిన బాబి డైరక్షన్లో తారక్ సినిమా ఉంటుందని ఫైనల్ అయ్యింది. మరో రెండు రోజుల్లో ముహుర్తం కూడా పెట్టబోతున్నారట. నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై ముందే ఆంక్షలు విధించారట. ఈమధ్య కళ్యాణ్ రాం తీస్తున్న సినిమాలన్ని ఫ్లాపులు అవుతుండటంతో ఈసారి బడ్జెట్ మితిమీరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు.

ఇక ఎంత బడ్జెట్ పెట్టినా తారక్ రేంజ్ వేరే.. అన్ని కుదరాలే కాని పెట్టిన దానికి డబుల్ త్రిపుల్ లాగేయొచ్చు కాని ఇప్పటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం ఎందుకని బాబికి ముందే 45 కోట్ల బడ్జెట్ అని చెప్పేశాడట కళ్యాణ్ రామ్. అంతకుమించి బడ్జెట్ పోకుండా చూడాలని గట్టిగా చెప్పారట. బాబికి కూడా దానికి ఓకే చెప్పడంతో ఇక అఫిషియల్ ఎనౌన్స్ చేయడమే లేటని అంటున్నారు.

పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన బాబి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక నిన్న మొన్నటిదాకా రవితేజతో సినిమా అని అనుకున్నా అది కుదరకపోవడంతో తారక్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. మరి ఫ్లాప్ వచ్చినా లక్కీ ఆఫర్ కొట్టేసిన బాబి సినిమాను ఏ రేంజ్లో తీస్తాడో చూడాలి.