ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్

0
38

Posted March 21, 2017

kalyan ram political background movie in upendra directionఇప్పటివరకు  కమర్షియల్ సినిమాలతో అలరించిన కళ్యాణ్ రామ్… ఇప్పుడు పొలిటికల్ నేపధ్యంలో సాగే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడట. ఈ సినిమాకు  శ్రీను వైట్ల అసిస్టెంట్ ఉపేంద్ర దర్శకత్వం వహించనున్నాడు.

ఓ ఎంపీతో జరిగిన వాగ్వాదంలో కళ్యాణ్ రామ్… తాను ఎమ్మెల్యే అవుతానని, చాతనైతే అడ్డుకోమని సవాల్ చేస్తాడట. ఆ ఛాలెంజ్ లో నెగ్గడం కోసం.. ఇంటింటికి మందు పధకం వంటి వెరైటీ పధకాలను ప్రవేశ పెడతాడట. తన కన్నింగ్ ఆలోచనలతో పొలిటికల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేస్తుంటాడట. నిజానికి ఈ సినిమా కూడా టెంపర్ సినిమా తరహాలోనే సాగుతుందట.  ఫస్టాప్ అంతా నెగిటివ్ షేడ్ లో నడుస్తుందట. సెకండాఫ్ లో రియలైజ్ అయ్యి, తన వల్ల నష్టపోయిన వారికి సహాయం చేస్తాడట హీరో.

నిజానికి ఈ పొలిటికల్ స్టోరీని దర్శకుడు…  సునీల్ కోసం రెడీ చేశాడట. అది అటు ఇటు  తిరిగి కళ్యాణ్ రామ్ దగ్గరకి వచ్చింది. దీంతో కాస్త కధనంలోనూ, డైలాగ్స్ లోనూ మార్పులు చేస్తున్నాడట దర్శకుడు. మరి ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.