‘బాహుబలి 2’ చూస్తున్న వారంతా ఫూల్స్‌.. అదో చెత్త సినిమా

0
111

 Posted April 29, 2017 at 12:05

kamaal r khan controversial tweets about on bahubali 2 movie
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండియన్‌ సినీ ప్రేక్షకులు అంతా కూడా నీరాజనాలు పడుతున్న ‘బాహుబలి 2’ సినిమాపై బాలీవుడ్‌కు చెందిన కమాల్‌ ఆర్‌ ఖాన్‌ నోరు పారేసుకున్నాడు. గతంలో పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి అందరి దృష్టిని ఆకర్షించిన కమాల్‌ ఇప్పుడు ‘బాహుబలి 2’పై విమర్శలు చేసి మరోసారి చర్చనీయాంశం అయ్యాడు. విమర్శలు చేస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని భావించాడో లేక మరేంటో కాని ‘బాహుబలి 2’ సినిమాను ఒక చెత్త సినిమాగా డిసైడ్‌ చేశాడు.

తాజాగా ‘బాహుబలి 2’పై ట్విట్టర్‌లో కమాల్‌ ఆర్‌ ఖాన్‌ స్పందిస్తూ… ఈ సినిమాను చూస్తున్న జనాలు ఫూల్స్‌. బాహుబలి సినిమాను చూపిస్తామని పిలిచి ఒక కార్ట్యూన్‌ సినిమాను చూపించారు. రాజమౌళి గారు ఇదేనా సినిమా అంటే, అసలు ఇందులో ఏముందని తీశారు, ప్రతి సీన్‌ కూడా 100 శాతం రియాల్టీకి దూరంగా ఉంది. ‘బాహుబలి 2’ సినిమాను మొగల్‌ ఏ ఆజమ్‌  డైరెక్టర్‌ చూస్తే ఖచ్చితంగా రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ షూట్‌ చేసి చంపేస్తాడు అంటూ తన నోటి దూళను ప్రదర్శించాడు. కమాల్‌ వ్యాఖ్యలపై సినీ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.