కమల్ కి మరో గౌరవం… ఫ్రెంచ్ పురస్కారం

   kamal haasan got french cheverly year awardకమల్ హాసన్ అంటే ఇండియన్ సినిమాకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే సినిమా కెరీర్ ప్రారంభించిన కమల్ కు సినిమానే ప్రాణం.. అదే జీవితం. అందుక 56 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు దక్కని అవార్డులు చాలా అరుదుగా ఉంటాయి. అసలు కమల్ కి ఓ అవార్డ్ ఇవ్వడం అంటే.. ఆ పురస్కారానికే గౌరవం దక్కినట్లుగా భావించేవాళ్లు చాలామందే ఉంటారు.

తాజాగా కమల్ కు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఓ అవార్డ్ ఇవ్వనుంది.ఆస్కార్ రేంజ్ హీరో కమల్ హాసన్ కు అరుదైన గౌరవం దక్కనుంది.ఫ్రెంచ్ గవర్నమెంట్ కమల్ కు చెవర్లియార్ అవార్డ్ ను ప్రధానం చేయనుంది.సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ఇదే. కమల్ హాసన్ ఫిలిం ఇండస్ట్రీలో సాధించిన విజయాలకు గాను ఈ అవార్డును అందించనుంది ఫ్రాన్స్. త్వరలో పారిస్ లో ఓ ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. అందులో ఈ అవార్డును అందించనున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.

ఇప్పటికే ఈ చెవర్లియార్ అవార్డును ఇండియా తరఫున శివాజీ గణేశన్.. అమితాబ్ బచ్చన్.. షారూక్ ఖాన్.. ఐశ్వర్యారాయ్.. నందితా రాజ్ లు అందుకున్నారు. ప్రస్తుతం కాలు విరగడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కమల్ హాసన్.. సెప్టెంబర్ చివర్లో శభాష్ నాయడు షూటింగ్ ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.అయితే ఈ లోపు అయ్యంగారు ఈ అవార్డ్ తో మరింత క్రెడిట్ దక్కించుకోనున్నారు.