5 ఏళ్ల ఎదురు చూపులకు బ్రేక్‌

Posted April 20, 2017 at 18:04

kamal hassan vishwaroopam 2 movie ready to release
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వరూపం’. పలు వివాదాలు, విమర్శల మద్య విడుదలైన విశ్వరూపం సినిమాకు అప్పుడే సీక్వెల్‌ను తీస్తున్నట్లుగా కమల్‌ ప్రకటించాడు. కేవలం మూడు నెలల గ్యాప్‌లో ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని విడుదల చేస్తానంటూ కమల్‌ ప్రకటించాడు. మొదటి పార్ట్‌ కంటే ఆసక్తికరంగా రెండవ పార్ట్‌ను తీర్చిదిద్దుతున్నట్లుగా కమల్‌ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ సినిమాను అర్థాంతరంగా ఆపేయడం జరిగింది. ఆ సినిమా ఆపేసి దాదాపు అయిదు సంవత్సరాలు అవుతుంది. ఎట్టకేలకు సినిమా మళ్లీ ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయిన ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను ప్రారంభిస్తున్నట్లుగా కమల్‌ హాసన్‌ ప్రకటించాడు. వచ్చే నెలలో ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కమల్‌కు ఈ సినిమా ఏమైనా వెన్ను దన్నుగా నిలుస్తుందా అనేది చూడాలి.