కనుపాప రివ్యూ

Posted February 3, 2017

kanupapa movie reviewచిత్రం:                 కనుపాప 
తారాగణం:            మోహన్‌లాల్‌,  బేబీ మీనాక్షి, సముద్రఖని, విమలారామన్‌ నడిమూడి వేణు

సంగీతం:              రోన్‌ ఎంథెన్‌ యెహన్‌ 
ఛాయాగ్రహణం:       ఎన్‌.కె. ఏకాంబరం 
నిర్మాత:               మోహన్‌లాల్‌

సమర్పణ:             ఓవర్సీస్‌ నెట్‌వర్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రచన, దర్శకత్వం:    ప్రియదర్శన్‌ 

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల జనతాగ్యారేజ్ సినిమాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత వచ్చిన మనమంతా కాస్త నిరాశపరచినా తాజాగా  కనుపాపతో మరో సారి  తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ఈ మల్లూభాయ్. మలయాళంలో ఘనవిజయం సాధించిన క్రైం థ్రిల్లర్ ఒప్పం సినిమా తెలుగులో కనుపాప పేరుతో విడుదలయ్యింది. మరి ప్రయోగాత్మక చిత్రాలు చేసే మోహన్ లాల్ కనుపాపతో సక్సెస్ ను అందుకున్నాడో లేదో చూద్దాం.

ఇక కథలోకి వెళ్తే..

సినిమాలో మోహన్ లాల్.. జయరామ్ గా, నడిమూడి వేణు.. కృష్ణమూర్తిగా, బేబీ మీనాక్షీ.. నందినిగా నటించారు.

గుడ్డివాడైన జయరామ్ వైజాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్‌మన్‌గా వర్క్ చేస్తుంటాడు. కంటిచూపు లేకపోయినా.. శబ్దాల ద్వారా, వాసనల ద్వారా కంటిచూపు ఉన్న వారికంటే బాగా అన్ని పనులు చేసుకుంటూ,  అందరితో కలివిడిగా ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆ అపార్ట్ మెంట్ లో ఉండే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కృష్ణమూర్తికి చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంటాడు. కృష్ణమూర్తి ఎవరికీ తెలియకుండా నందినిని ఊటిలో ఉంచి చదివిస్తుంటాడు. కాగా కృష్ణమూర్తి హత్య గురవ్వడంతో, ఆ నేరం జయరామ్ పై పడుతుంది. అదే సమయంలో  జయరామ్… నందినికి గార్డియన్ గానూ మారతాడు.  అసలు కృష్ణమూర్తిని ఎవరు చంపారు,  మీనాక్షికి జయరామ్ గార్డియన్‌గా ఎందుకు మారాల్సి వస్తుంది, హత్యానేరం నుండి  జయరామ్ ఎలా బయట పడ్డాడు..? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే..

ఇక కధనం ఏంటంటే…

ఓ అంధుడు హంతకుడ్ని పట్టుకోవడం, అతని బారి నుంచి తననీ, పాపనీ కాపాడుకోవడమే సినిమా  పాయింట్‌. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా సెకండాఫ్ లో హీరోకి, విలన్ కి మధ్య సాగే  టిట్ ఫర్ టాట్స్, ధ్రిల్లర్ సన్నివేశాలు బాగుంటాయి.

ఇక ఎవరు ఎలా చేశారంటే…

మోహన్‌లాల్‌ తప్ప ఇంకెవ్వరూ ఈ గుడ్డి పాత్రను  పండించలేరు అన్నట్లుగా ఆయన నటన సాగుతుంది. సైకో విలన్ గా సముద్రఖని తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఆయన మాట్లాడిన మాటలు తక్కువగానే ఉన్నా కేవలం కళ్లతో, హావభావాలతో భయం పుట్టించేశాడు. మీనాక్షి ముద్దు ముద్దు మాటలతో అలరించింది. మోహన్ లాల్ ను ఎలివేట్ చేసే సీన్స్ ని  పర్ఫెక్ట్ గా రాసుకున్న ప్రియదర్శన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్పీడు మాత్రం చూపించలేదు. స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టిన 4 మ్యూజిక్స్ గ్రూప్ ఇచ్చిన సంగీతం, ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

మోహన్ లాల్ నటన
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

స్లో నారేషన్ 

ఆఖరిపంచ్: కనురెప్ప వేయకుండా కనుపాపను  చూడచ్చు.

Telugu Bullet Rating: 3.5/5