3వ పార్ట్‌ కోసం కరణ్‌ జోహార్‌ ప్రయత్నాలు

0
45

Posted May 14, 2017 at 18:17

karan johar plans for bahubali third part
జక్కన్న రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ చిత్రాలు ప్రేక్షకుల నుండి అద్బుత ఆధరణను పొందాయి. ముఖ్యంగా ‘బాహుబలి 2’ సంచలన కలెక్షన్స్‌ను సాధించి ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 1350 కోట్ల కలెక్షన్స్‌ను సాధించినట్లుగా ప్రచారం జరుగుతుంది. బాహుబలి రెండు పార్ట్‌లు ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మూడవ పార్ట్‌ను అంతా కోరుకుంటున్నారు. ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా మూడవ పార్ట్‌ వస్తే బాగుండు, అలాంటి కథతో మరో పార్ట్‌ను జక్కన్న సినిమా చేయాలని ప్యాన్స్‌ ఆశిస్తున్నారు. అందుకోసం బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు.

‘బాహుబలి’ చిత్రాన్ని హిందీలో డబ్‌ చేసిన కరణ్‌ జోహార్‌కు భారీ లాభాలు దక్కాయి. దాంతో ఆయన ఇప్పుడు రాజమౌళిని మూడవ పార్ట్‌ చేయమంటూ ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే జక్కన్న తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మంచి కథను సిద్దం చేస్తే ‘బాహుబలి 3’ పార్ట్‌ను చేసేందుకు తనకేం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు. అయితే విజయేంద్ర ప్రసాద్‌ మాత్రం ఇప్పుడు మూడవ పార్ట్‌కు ఛాన్స్‌ లేదని, బాహుబలి కథ పూర్తి అయ్యిందని తేల్చి చెప్పాడు. అయినా కూడా కరణ్‌ జోహార్‌ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. మరి కరణ్‌ జోహార్‌ ఫలించి ‘బాహుబలి 3’ వస్తుందా అనేది చూడాలి.