మోడీకి ఆడోళ్ళ దోషం …రెండునెలల్లో దుష్ఫలితం?

Posted December 23, 2016

karnataka astrologer brahmanda narendra sharma said modi have women error and 3 time dangerous situations
జనం నోళ్ళలో ఎవరు నానుతుంటే వారి గురించి నాలుగు మంచిమాటలో ..చేదు మాటలో చెప్పేస్తే కావాల్సినంత పబ్లిసిటీ. ఈ టెక్నిక్ ని భలే పట్టేసుకున్నారు కొందరు జోస్యులు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ జ్యోతిష్కుడు ప్రధాని మోడీ గురించి ఇలాంటి మాటలే చెప్పి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.కన్నడ సీమలో బాగా తెలిసిన ఈయన పేరు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ.ఈయన చెప్పినదాని ప్రకారం ప్రధాని మోడీకిఉందట.కన్న తల్లిని,కట్టుకున్న భార్యని దూరం పెట్టినందువల్ల ఈ దోషం అంటుకుందట.దాని వల్ల మూడు గండాలు ఉంటే ఇప్పటికే రెంటి నుంచి మోడీ బయటపడిపోయాడంట.

ఆఫ్గనిస్తాన్ పర్యటనకి వెళ్ళినపుడు మోడీ ప్రయాణిస్తున్న విమానం వాతావరణ అననుకూలత వల్ల అత్యవసరంగా కిందకు దిగాల్సి వచ్చిందని …అది ఓ పెను గండమని నరేంద్ర శర్మ మాట.ఇక పాకిస్తాన్ టూర్ వెళ్లి క్షేమంగా వెనక్కి రావడమే తప్పిపోయిన ఇంకో గండమట.ఇక ఫిబ్రవరి లో మూడో గండం పొంచి ఉందట.అది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదట.ఆ గండాన్ని దాటేస్తే మరో 12 సంవత్సరాల దాకా మోడీని ఎవరూ ఏమీ చేయలేరట.నరేంద్ర మాటల్లో నిజముందోలేదో గానీ అయన అనుకున్న పాపులారిటీ మాత్రం వచ్చేస్తోంది.